-
- బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే03
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని స్థానిక 30 వార్డులో స్థానిక విద్యానగర్లో శుక్రవారం రోజున ఉదయం 6 గంటల నుండి బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని శుక్రవారం రోజున ప్రతి ఇంటి గడప గడపకు ప్రచారం చేసినారు.ఈ కార్యక్రమంలో 30వ వార్డు బిఆర్ఎస్ పార్టీ బూత్ అధ్యక్షుడైన కేసరి. మధుకర్ రావు మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎన్నో జిమ్మిక్కులు చేసిందని, ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చేయలేకపోయిందని మొక్కుబడిగా నాలుగు గ్యారంటీలు ఇచ్చి చేతులు దులుపుకున్నదని,ఏకకాలంలో రైతు రుణమాఫీ అధికారంలో వచ్చిన వెంటనే చేస్తానని చేయలేదని, కెసిఆర్ చేపట్టిన రైతుబంధును మరియు దళిత బంధు రెండో దఫాను కాంగ్రెస్ నిలిపి వేసిందని ఆయన తెలిపారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేక పోయిం దని ఆయన తెలిపారు.రైతులకు వ్యవసాయం చేసుకోవ డానికి యాసంగి పంటకు నిరందించ లేకపోతుందని,పం డిన వడ్లకు గిట్టుబాటు ధరతో పాటు,బోనస్ గా 500 ఇస్తానని ఇవ్వలేక పోయిందని తెలిపారు. ఆసరా, విక లాంగుల, ఒంటరి మహిళ పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం ద్వారా పెన్షన్లు పొందే వారు ఎంతో నిరాశ నిస్పృహలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే03
బోయినపల్లి వినోద్ కుమార్ ను పార్లమెంటు బి ఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ తో గెలిపించినట్లయితే, రాబోయే రోజులలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని, కరీంనగర్ పార్లమెంటు నియోజక వర్గాన్ని పారిశ్రామికంగా, విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దిల్ శ్రీనివాస్, పూసల ప్రభావతి, బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్ర రాజకుమార్, పూసల శేషాద్రి నాయుడు, ఎర్ర సంపత్, తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
Post Views: 60