పైన పటారం – లోన లొటారం

హుజురాబాద్ (బాహుబలం న్యూస్)ఏప్రిల్ 21. హుజురాబాద్ నడిబొడ్డున , అంబేద్కర్ చౌరస్తాలో ప్రజల సౌకర్యార్థం హుజురాబాద్ పురపాలక సంఘం ఘనంగా ఏర్పాటు చేసి న చలివేంద్రం పైన పటారం లోన లొటారం సామెతను గుర్తు చేస్తోంది. పైన అన్ని హంగు లతో ఉన్న చలివేంద్రం వద్దకు దాహం వేసి వెళ్లిన వాల్లకి నిరాశే ఎదురౌతోంది. చలి వేంద్రం లో త్రాగునీరు గానీ , రంజన్లు గానీ , నీరు పోసే మనుషులు గానీ ఎవరూ లేక వెనక్కి మరలుతున్నారు. అత్యదిక వేడి ఉన్న ఈ మండే ఎండల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం లో త్రాగునీరు దొరికితే బాగుండునని హుజురాబాద్ ప్రజలు మరి యు ఇతరత్రా పనుల మీద ఈ ప్రాంతానికి వచ్చిన సామాన్య ప్రజానీకం వాపోతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !