బాహు బలంన్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 07:
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు పలు న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఈనెల 8న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ‘రెడ్ల నిరసన దీక్ష’ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలతో రెడ్డి ఐకాస నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయని, నెల రోజుల్లోగా సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డి సమర్థించారు.










