బాహు బలంన్యూస్ హుజూరాబాద్,సెప్టెంబర్ 05: ఎన్నికల సమయంలో రైతులకు, విద్యార్థులకు, వివిధ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, లేనిపక్షంలో పోరాటం తప్పదని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి స్పష్టం చేశారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర రెడ్డి సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద వేలాది మందితో భారీ నిరసన దీక్ష (మహాధర్నా) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాధర్నాకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని, తాను కూడా స్వయంగా పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టే ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రజాసంఘాలు, సంబంధిత వర్గాలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Post Views: 14










