పీఆర్‌టీయూ సైదాపూర్ మండల నూతన రథసారథులు వీరే! – అధ్యక్షుడిగా గడిపె సహోదర్, ప్రధాన కార్యదర్శిగా చిట్టి లక్ష్మారెడ్డి ఏకగ్రీవం

bahubalamtv Reporter
bahubalamtv.in

పీఆర్‌టీయూ సైదాపూర్ మండల నూతన రథసారథులు వీరే! – అధ్యక్షుడిగా గడిపె సహోదర్, ప్రధాన కార్యదర్శిగా చిట్టి లక్ష్మారెడ్డి ఏకగ్రీవం

బాహు బలంన్యూస్,సైదాపూర్, సెప్టెంబర్ 04: మండల కేంద్రం సమీపంలోని బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఆవరణలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్‌టీయూ టీఎస్) సైదాపూర్ మండల సర్వసభ్య సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. మండల వ్యాప్తంగా సుమారు 60 మంది ప్రాథమిక సభ్యులు హాజరైన ఈ సమావేశంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జయపాల్ రెడ్డి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జాలి రాఘవరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాల్‌రెడ్డి, రావుల గంగాధర్ రెడ్డి, ముస్కు తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల అధికారులుగా చిగురుమామిడి పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు ఈ. లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్. మల్లినాథ్ శర్మ వ్యవహరించి నూతన కార్యవర్గ ఎన్నికను లాంఛనంగా పూర్తి చేశారు.
నూతన కార్యవర్గ వివరాలు:
అధ్యక్షుడు: గడిపె సహోదర్
ప్రధాన కార్యదర్శి: చిట్టి లక్ష్మారెడ్డి
అసోసియేట్ అధ్యక్షుడు: గొల్లూరి ప్రమోద్ కుమార్
మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు: చిగురాల రామలక్ష్మి
ఉపాధ్యక్షుడు: గజరవేని కుమారస్వామి
మహిళా ఉపాధ్యక్షురాలు: కె. ఉజ్వల
కార్యదర్శులు: పి. శ్రీనివాస్ (కార్యదర్శి-1), కె. రాగోత్తం రెడ్డి (కార్యదర్శి-2)
మహిళా కార్యదర్శులు: టి. రజని (మహిళా కార్యదర్శి-1), డి. సరిత (మహిళా కార్యదర్శి-2)
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులకు సంఘ నేతలు, తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి, సంఘ పటిష్టతకు నిరంతరం అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మహిళలను కాంగ్రెస్ దారుణంగా వంచించింది: పూసల ప్రభావతి రెడ్డి. హుజూరాబాద్‌లో 1000 రోజుల కాంగ్రెస్‌ పాలనపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘బాకీ కార్డు’ పంపిణీ, భారీ నిరసన హామీలు నెరవేర్చేదాకా పోరుబాట: ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రభావతి రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !