బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 21 : శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు పూసల ప్రభావతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సకల సౌభాగ్యాలు సిద్ధించాలి.
సకల శుభాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆమె ప్రార్థించారు. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పవిత్ర పూజతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు.
ఆడబిడ్డల ఉన్నతే సమాజ ప్రగతి.
సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఆడబిడ్డలందరూ అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబం పాడిపంటలతో, ప్రశాంతతతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు..









