సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలి.. ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి. వన్నారంలో ఘన స్వాగతం పలికిన జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు… రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

bahubalamtv Reporter
bahubalamtv.in

సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలి.. ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి. వన్నారంలో ఘన స్వాగతం పలికిన జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు… రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

బాహు బలంన్యూస్ మానకొండూరు,: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల సమగ్ర అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండలంలోని వన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ తాళ్లపల్లి సంపత్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న సమగ్ర రెవెన్యూ సర్వే వివరాలను గ్రామస్థులకు వివరించారు.
అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు సీనియర్ సిటిజన్, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు గ్రామస్థులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శంషాబాద్ కెనాల్ మీదుగా రామకృష్ణా పూర్ బీటీ రోడ్డు పనులను వేగవంతం చేయాలని, వన్నారం నుంచి గంగిపల్లి మల్లికార్జున స్వామి ఆలయం వరకు నూతన బీటీ రోడ్డు, గట్టుదుద్దెనపల్లి హైవే నుంచి వన్నారం మీదుగా ఏరడపల్లి వరకు గల ఆర్ అండ్ బీ రోడ్డు మరమ్మతులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు పోలాడి రామారావు వినతిపత్రాలు అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ నిధుల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో షర్మిల, సర్వే భూ రికార్డుల అదనపు డైరెక్టర్ కిషన్ రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, డీసీఎస్వో నర్సింగరావు, ఏఈఓ ప్రశాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్, ఉప సర్పంచ్ బాకారపు రాములు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలి.. ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి. వన్నారంలో ఘన స్వాగతం పలికిన జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు… రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !