హుజూరాబాద్‌పై ‘డంపింగ్’ కుట్ర… గాంధీ వారసుల సహనం పరీక్షించకండి.. అన్యాయంపై గాడ్సేలలా మారుతాం: “మా ఊపిరి తీస్తే.. మీ కుర్చీలు కూలుతాయి” – అకినేపల్లి అర్ధనగ్న దీక్షతో సెగలు గక్కుతున్న . రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఏప్రిల్ 5 :
“హుజూరాబాద్ గడ్డపై విషపు డంపింగ్ యార్డును నిర్మించి, ఇక్కడి పసిప్రాణాలను బలిపశువులను చేయాలని చూస్తే సహించేది లేదు. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి, చట్టాలను బూజు పట్టించి సిర్సపల్లిలో తలపెట్టిన ఈ ప్రాజెక్టును తక్షణమే పాతరేయాలి” అని రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ధ్వజమెత్తారు. ఆదివారం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అకినేపల్లి రమేష్ చేపట్టిన అర్ధనగ్న దీక్షా శిబిరానికి ఆయన హాజరై, ప్రభుత్వ మొండివైఖరిపై నిప్పులు చెరిగారు. పద్నాలుగు రోజులుగా శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని ప్రభుత్వం తక్కువ అంచనా వేస్తోందని, ఇకపై పాలకుల నిద్ర పోగొట్టేలా ‘తెలంగాణ ఉద్యమ’ స్ఫూర్తితో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు.
గాంధీ వారసులమే.. కానీ అన్యాయంపై గాడ్సేలమే!
ఈ సందర్భంగా పోలాడి రామారావు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. “ఆర్యవైశ్యులు అహింసావాదులు, శాంతికి కాముకులు, గాంధీ వారసులు.. కానీ మా ఉనికిని, మా బిడ్డల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ విషపు యార్డును మా నెత్తిన రుద్దాలని చూస్తే మాత్రం గాడ్సేలలా మారి అన్యాయాన్ని ఖతం చేస్తాం” అని అత్యంత ఘాటుగా హెచ్చరించారు. రెండు వారాల్లోగా ఈ ప్రాజెక్టును రద్దు చేస్తూ అధికారిక ప్రకటన వెలువడకపోతే, వేలాది మంది జనంతో హుజూరాబాద్ హైవేను **’చతుర్ముఖ వ్యూహం’**తో అష్టదిగ్బంధనం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. అప్పుడు జరిగే శాంతిభద్రతల విఘాతానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
శ్మశానవాటికగా మార్చే కుట్రలు సాగనివ్వం
హుజూరాబాద్ ప్రాంతం ఇప్పటికే జిల్లా కేంద్రం కాక అభివృద్ధిలో వెనుకబడిందని, చుట్టూ హైవే రోడ్లతో ఒక చిన్న ‘దీపకల్ప ప్రాంతం’లా ఉన్న ఈ పట్టణాన్ని ఇప్పుడు **’రోగాల నిలయం’**గా మార్చాలని చూడటం దుర్మార్గమని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ డంపింగ్ యార్డ్ వల్ల పచ్చని పొలాలు ఎరుపెక్కి, భూగర్భ జలాలు కలుషితమై, కరోనా కంటే భయంకరమైన వ్యాధులు ప్రజలను చుట్టుముడతాయి. జెజెమ్మలు దిగివచ్చినా, అటున్న సూర్యుడు ఇటు పొడిచినా సరే.. ప్రభుత్వ మెడలు వంచి ఈ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం. ఇది నా ఆన!” అంటూ ఆయన చేసిన శపథం దీక్షా శిబిరంలో ఉద్వేగాన్ని నింపింది.
కదం తొక్కిన నాయకగణం
అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన అకినేపల్లి రమేష్‌కు స్థానిక కార్పొరేటర్లు గందే శ్రీనివాస్, పోరెడ్డి శంతన్ రెడ్డిలు నచ్చజెప్పి దీక్షా శిబిరానికి తరలించగా, ప్రజలు భారీగా తరలివచ్చి మద్దతు ప్రకటించారు. ఈ నిరసనలో ఆర్యవైశ్య సంఘాల డివిజన్ అధ్యక్షుడు సుద్దాల హరిశంకర్, కార్యదర్శి నూనె శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కార్పొరేటర్లు వర్ధినేని రవీందర్ రావు, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, రాజేశ్వర్ రావు, చందా చంద్రగుప్త, పల్కల ఈశ్వర్ రెడ్డి, కట్కూరి మల్లారెడ్డి, బెల్లి రాజయ్య, కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు శీల రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శి యాంసాని శశిధర్, వాకర్స్ అసోసియేషన్ నేతలు కొమురవెల్లి హరిప్రసాద్, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజూరాబాద్‌పై ‘డంపింగ్’ కుట్ర… గాంధీ వారసుల సహనం పరీక్షించకండి.. అన్యాయంపై గాడ్సేలలా మారుతాం: “మా ఊపిరి తీస్తే.. మీ కుర్చీలు కూలుతాయి” – అకినేపల్లి అర్ధనగ్న దీక్షతో సెగలు గక్కుతున్న . రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

కరీంనగర్ వేదికగా ‘రైతు మహాగర్జన’.. 28న 2 లక్షల మందితో సమరభేరి! – ప్రభుత్వ వైఫల్యాలపై రైతు ప్రజాసంఘాల జేఏసీ యుద్ధప్రకటన – గోడప్రతులను ఆవిష్కరించిన మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్.

ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రాజెక్టా? వెంటనే రద్దు చేయాల్సిందే! మున్సిపల్ చైర్మన్ సుహాసిని, …రైతు సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ వేలాది మంది విద్యార్థులతో భారీ మానవహారం.. స్తంభించిన ట్రాఫిక్.

డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేయాల్సిందే. జనావాసాల మధ్య ‘విషపు ప్లాంట్’ పెడితే ఊరుకోం – 9వ రోజు నిరసన దీక్షల్లో రైతు జేఏసీ జాతీయ అధ్యక్షుడి పోలాడి రామారావు. హెచ్చరిక. ప్రభుత్వ వైఖరిపై వినూత్నంగా పోస్ట్ కార్డు ఉద్యమం – హుజురాబాద్ ప్రాంతాన్ని చుట్టుముడుతున్న నిరసన సెగలు.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !