ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.. సేవా భావం, అభివృద్ధి ఆదర్శప్రాయం: డాక్టర్ నాగుల సత్యం గౌడ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.. సేవా భావం, అభివృద్ధి ఆదర్శప్రాయం: డాక్టర్ నాగుల సత్యం గౌడ్.

బాహుబలంన్యూస్ హుజురాబాద్ అక్టోబర్ 27:మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను పట్టణంలోని అవంతి కన్వెన్షన్ హాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, ప్రజాకవి, తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విజయ్ కుమార్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కొనియాడారు. పేదవారికి తోచిన సహాయం చేస్తూ, సేవా భావమే జీవిత లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. మున్సిపల్ చైర్మన్గా తన హయాంలో హుజురాబాద్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని, స్వార్థం వీడి మానవత్వాన్ని పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం విజయ్ కుమార్ను శాలువాతో సత్కరించి, ఆధ్యాత్మిక కవిత సారపు జ్ఞాపక, బొకే అందజేసి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం, సిపిఐ నాయకులు శ్రావణ్, మలుగూరి ప్రభాకర్, బొడ్డు సంజయ్, తునికి వసంత్, నందగిరి శ్రీనివాస్, బాబురావు, వెంకటస్వామి సాయిల రాజు, జడల సమ్మయ్య, బండ నవీన్, చందు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !