జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెల్పూర్‌లో భారీ కంటి స్క్రీనింగ్: 250 మందికి పరీక్షలు, ఆపరేషన్ చేయించుకున్న వారిలో ఆనందం

bahubalamtv Reporter
bahubalamtv.in

జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెల్పూర్‌లో భారీ కంటి స్క్రీనింగ్: 250 మందికి పరీక్షలు, ఆపరేషన్ చేయించుకున్న వారిలో ఆనందం

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ అక్టోబరు 18 ;: జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి మానవత్వానికి అద్దం పట్టేలా చెల్పూర్ గ్రామంలో మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. శుక్రవారం రోజున ఈరోజున చెల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ కంటి స్క్రీనింగ్ కార్యక్రమంలో దాదాపు 250 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు.
గత లబ్ధిదారుల సంతోషం:
ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశాలలో భాగంగా, గతంలో జయన్న ఫౌండేషన్ సౌజన్యంతో కంటి ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు కూడా శుక్రవారం శిబిరానికి హాజరయ్యారు. వారికి డాక్టర్లు పోస్ట్-ఆపరేటివ్ చెకప్‌లు నిర్వహించి, కంటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు, సూచనలు అందించారు.
ఈ సందర్భంగా, ఆపరేషన్ చేయించుకున్న లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. "మాకు కళ్లు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. స్పష్టమైన చూపును తిరిగిచ్చింది గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాకుండా, ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు," అని వారు కృతజ్ఞతా భావంతో కొనియాడారు. వారి ఆనందం, సంతృప్తి ఈ కార్యక్రమం యొక్క విజయాన్ని తెలియజేశాయి.

ఉచితంగా ఆపరేషన్లు:
గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి చొరవతో, దృష్టి లోపంతో బాధపడుతున్న పేద ప్రజల కోసం జయన్న ఫౌండేషన్ ఉచిత కంటి ఆపరేషన్లను నిరంతరం నిర్వహిస్తోంది. కేవలం స్క్రీనింగ్ నిర్వహించడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి, నాణ్యమైన వైద్య సేవలను పేదల చెంతకు చేరుస్తోంది. ఫౌండేషన్ అందిస్తున్న ఈ సేవలు సమాజంలో ఎంతోమందికి వెలుగునిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో చెల్పూర్ గ్రామ ప్రజలు, జయన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఫౌండేషన్ సేవలను గ్రామ పెద్దలు, ప్రజలు అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ అక్టోబరు 18 ;: జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి మానవత్వానికి అద్దం పట్టేలా చెల్పూర్ గ్రామంలో మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. శుక్రవారం రోజున ఈరోజున చెల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ కంటి స్క్రీనింగ్ కార్యక్రమంలో దాదాపు 250 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు.
గత లబ్ధిదారుల సంతోషం:
ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశాలలో భాగంగా, గతంలో జయన్న ఫౌండేషన్ సౌజన్యంతో కంటి ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు కూడా శుక్రవారం శిబిరానికి హాజరయ్యారు. వారికి డాక్టర్లు పోస్ట్-ఆపరేటివ్ చెకప్‌లు నిర్వహించి, కంటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు, సూచనలు అందించారు.
ఈ సందర్భంగా, ఆపరేషన్ చేయించుకున్న లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. “మాకు కళ్లు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. స్పష్టమైన చూపును తిరిగిచ్చింది గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాకుండా, ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు,” అని వారు కృతజ్ఞతా భావంతో కొనియాడారు. వారి ఆనందం, సంతృప్తి ఈ కార్యక్రమం యొక్క విజయాన్ని తెలియజేశాయి.

ఉచితంగా ఆపరేషన్లు:
గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి చొరవతో, దృష్టి లోపంతో బాధపడుతున్న పేద ప్రజల కోసం జయన్న ఫౌండేషన్ ఉచిత కంటి ఆపరేషన్లను నిరంతరం నిర్వహిస్తోంది. కేవలం స్క్రీనింగ్ నిర్వహించడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి, నాణ్యమైన వైద్య సేవలను పేదల చెంతకు చేరుస్తోంది. ఫౌండేషన్ అందిస్తున్న ఈ సేవలు సమాజంలో ఎంతోమందికి వెలుగునిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో చెల్పూర్ గ్రామ ప్రజలు, జయన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఫౌండేషన్ సేవలను గ్రామ పెద్దలు, ప్రజలు అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !