సమాచార హక్కు చట్టంపై ఉమ్మడి వరంగల్‌లో కార్యాచరణ సదస్సు: ప్రజలకు అండగా నిలవాలని పిలుపు..

bahubalamtv Reporter
bahubalamtv.in

సమాచార హక్కు చట్టంపై ఉమ్మడి వరంగల్‌లో కార్యాచరణ సదస్సు: ప్రజలకు అండగా నిలవాలని పిలుపు..

బాహు బలంన్యూస్ హన్మకొండ, జులై 18: ఉమ్మడి వరంగల్ జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని థౌసండ్ పిల్లర్స్ హోటల్‌లో శుక్రవారం (జులై 18, 2025) ఒక కార్యాచరణ సదస్సు ఘనంగా జరిగింది. సమాచార హక్కు చట్టం (RTI) ప్రాముఖ్యత, ప్రజలకు ఎలా అండగా నిలబడాలి అనే అంశాలపై ఈ సదస్సులో చర్చించారు.
ఈ కార్యక్రమానికి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ & వ్యవస్థాపక అధ్యక్షులు డా. చంటి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి సూర స్రవంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపినాథ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. దిలీప్‌రావు, మరియు పలువురు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మరియు కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి ప్రముఖులు ప్రసంగించారు. RTI చట్టం గురించి, ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి, ప్రభుత్వం మరియు ప్రజలకు మధ్య వారధిగా ఎలా పనిచేయాలి, ప్రజల్లో RTI పట్ల అవగాహన ఎలా పెంచాలి, మరియు నూతన కమిటీలను సమన్వయం చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలి అనే అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు, వరంగల్ జిల్లా అధ్యక్షులు బొల్లం విజయ్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు మీసాల విజయ్, హన్మకొండ జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్ కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను సదానందం, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల అధ్యక్షులు కోవరాజు సాగర్, దుర్గ ప్రసాద్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రాము, వరంగల్ జిల్లా కార్యదర్శి రమేష్, వరంగల్ జిల్లా నెక్కొండ జనరల్ సెక్రటరీ కారు స్వామి, వరంగల్ జిల్లా కన్వీనర్ కోడి విజయలత, జనగాం జిల్లా ఇంచార్జి ఎలమాకంటి నాగరాజు, ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ తోట సురేష్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !