వర్షంలోనూ వెనకడుగు వేయని తహసిల్దార్ .. ఆక్రమణల తొలగింపుకు ఆదేశాలు. అభినందనీయురాలు తహసిల్దార్ సురేఖ…

బాహు బలంన్యూస్ కేశపట్నం, జూలై 18: కేశపట్నం మండల తహసిల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న సురేఖ మేడం, నిస్వార్థ సేవ, నిజాయితీ, అంకితభావాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. కేవలం విధులు నిర్వర్తించడమే కాకుండా, ప్రజా సంక్షేమాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ, ఆమె తీసుకుంటున్న చొరవ ప్రజల మన్ననలను పొందుతోంది.
తాజాగా గురువారం రోజు వర్షంలో కూడా వెనకడుగు వేయకుండా, కలెక్టర్ ఆదేశాల మేరకు చూచన తప్పకుండా, మొలంగూరు గ్రామ శివారులోని అక్రమణకు గురైన ప్రభుత్వ భూముల ఆక్రమణలను స్వయంగా పరిశీలించి, వాటిని తొలగించేందుకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, గొడుగు పట్టుకుని రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి దాదాపు 16 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమిని (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించినవి) క్షేత్ర స్థాయిలో పరిశీలించడం ఆమె అంకితభావానికి నిదర్శనం. అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్లు, కొట్టములను తక్షణమే తొలగించాలని ఆమె ఆదేశించడంతో, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పట్ల ఆమెకున్న నిబద్ధత స్పష్టమైంది…
మేడంకు సెల్యూట్, మేడంకు వందనం”
TJS జిల్లా అధ్యక్షులు మోరె గణేష్..

TJS జిల్లా అధ్యక్షులు మోరె గణేష్ వంటి నాయకులు సైతం సురేఖ మేడం సేవలను కొనియాడుతూ, “మేడంకు సెల్యూట్, మేడంకు వందనం” అంటూ ప్రశంసించారు. గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఇంటి స్థలాలు మంజూరు చేసి, ఇందిరమ్మ ఇళ్లు అందించడానికి కృషి చేస్తానని ఆమె ఇచ్చిన హామీ, ఆమె గొప్ప మనసును, పేదల పట్ల ఆమెకున్న సానుభూతిని తెలియజేస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులు తమ ప్రాంతానికి రావడం గర్వకారణమని ప్రజలు భావిస్తున్నారు.
ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తహసిల్దార్ సురేఖ మేడం, ఒక ఆదర్శవంతమైన అధికారిణిగా, ప్రజా నాయకురాలిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నారు. ఆమె సేవలు మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..