కాట్రపల్లిలో వరుణ దేవుడి కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం…

bahubalamtv Reporter
bahubalamtv.in

కాట్రపల్లిలో వరుణ దేవుడి కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం…

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 16 ]: వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న కాట్రపల్లి గ్రామ ప్రజలు వరుణ దేవుడి కరుణ కోసం గ్రామ దేవతలకు ఘనంగా జలాభిషేకం నిర్వహించారు. ఎండిపోతున్న పంటలను కాపాడాలని, పాడి పశువులు సమృద్ధిగా వృద్ధి చెందాలని కోరుతూ గ్రామస్తులంతా ఏకమై ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చేపట్టారు.

వేసవి కాలాన్ని తలపించేలా ఉన్న ప్రస్తుత వర్షాకాల పరిస్థితులతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో భగవంతునిపై విశ్వాసంతో, తమ గ్రామ దేవతలైన హనుమాన్ దేవాలయం, సీతారామచంద్ర వారి దేవాలయం, శివాలయం, భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి, పోచమ్మ తల్లి దేవాలయం, ఎల్లమ్మ తల్లి దేవాలయం, నాగేంద్ర స్వామి దేవాలయం, కట్ట మైసమ్మ, గడి మైసమ్మ, దుర్గమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక జలాభిషేకాలు నిర్వహించారు. గ్రామస్థులు తమ చేతులతో బిందెల కొద్దీ నీటిని తెచ్చి గుళ్లలోని దేవతా విగ్రహాలపై పోస్తూ, వానలు కురవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపిటిసి రావుల అనిత వెంకట్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెరుమాండ్ల బిక్షపతి, కాసగొని కిరణ్, బాణాల కుమార్, బొల్లా చంద్రమౌళి, రావుల సురేందర్, ముప్పు సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామానికి వర్షాలు కురిసి, పంటలు పండి, పశు సంపద వృద్ధి చెందాలని గ్రామ ప్రజలంతా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జలాభిషేకంతో వరుణ దేవుడు కరుణిస్తాడని గ్రామ ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !