ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: ఎస్ఎఫ్‌ఐ

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జూలై 5:
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పొడిశెట్టి అభిలాష్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ తాసిల్దార్ కె. కనకయ్యకు శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా పొడిశెట్టి అభిలాష్ మాట్లాడుతూ, ఫీజు బకాయిల వల్ల రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి బలవంతంగా పెండింగ్ ఫీజులను వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లాలంటే సర్టిఫికెట్ల కోసం కళాశాలల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని కళాశాలలు ఒత్తిడి చేసి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయని అభిలాష్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన ఆరోపించారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సందీప్, బాలాజీ, సాయికిరణ్, సిద్దు, ప్రణయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..