ప్రైవేట్ స్కూళ్ల, బుక్‌స్టాల్స్‌పై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్

bahubalamtv Reporter
bahubalamtv.in

ప్రైవేట్ స్కూళ్ల, బుక్‌స్టాల్స్‌పై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జమ్మికుంట, జూన్ 27,: జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, బుక్‌స్టాల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫోరం ఫర్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ (ఏఐఎఫ్‌డీఎస్) ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పాఠశాలలు, బుక్‌స్టాల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అన్నారు.
జమ్మికుంట పట్టణంలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్లు సిండికేట్‌గా ఏర్పడి, కొన్ని బుక్‌స్టాల్స్ యజమానులతో ఒప్పందాలు చేసుకున్నాయని శ్రీకాంత్ ఆరోపించారు. పాఠశాలలు తల్లిదండ్రులను నిర్దిష్ట బుక్‌స్టాల్స్‌కు పంపిస్తున్నాయని, అక్కడ పుస్తకాల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ విషయమై బుక్‌స్టాల్స్‌ను విజిట్ చేయాలని శ్రీకాంత్ మండల విద్యాధికారిని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులపై పడుతున్న ఈ అదనపు భారాన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్ చేస్తోంది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !