కరాటే విద్యార్థులకు ఘన సన్మానం.

bahubalamtv Reporter
bahubalamtv.in

కరాటే విద్యార్థులకు ఘన సన్మానం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 23: హుజురాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ ఫోటోకాన్ కరాటే డు అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో బెల్ట్ మెరిట్ టెస్ట్‌లో విజయం సాధించిన కరాటే విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజురాబాద్ టౌన్ సీఐ టీ కరుణాకర్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ హాజరయ్యారు. వారు విజేతలైన విద్యార్థులను సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరాటేను వృత్తిగా ఎంచుకుని ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కరాటే మాస్టర్ ఎస్కే జలీల్‌ను అభినందించారు. కరాటే విద్యార్థులకు మానసిక పరిపక్వతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి సమాజంలోని ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధులను చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతగానో దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండా గణేష్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షుడు ఖలీద్ హుస్సేన్, ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపాల్ పెండ్యాల రాజిరెడ్డి, కరాటే అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అంబాల ప్రభాకర్, బి. రాజ్‌కుమార్, టి. గోపాల్, కరాటే మాస్టర్లు ఎస్కే జానీ, శ్రీనాథ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !