వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి: జాతీయ వడ్డెర సంఘం డిమాండ్..

బాహు బలంన్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:
కర్నూలు, మే 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వడ్డెరలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చాలని జాతీయ వడ్డెర సంఘం నాయకులు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు డిమాండ్ చేశారు. కర్నూలులో జరిగిన రాయలసీమ ఒడియా రాజుల ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
వడ్డెర సంఘ భవనంలో జరిగిన ఈ సమావేశానికి సూర్యవంశపు కాలసూర్య శ్రీ రాజా వీర దేవరాజు (బెంగళూరు) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బత్తుల లక్ష్మీకాంతయ్య (వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు), మక్కల శ్రీనివాసులు (కర్నూలు జిల్లా వడియరాజుల సంక్షేమ సంఘం అధ్యక్షులు), వి. వెంకటయ్య (కర్నూలు జిల్లా సిటీ ప్రెసిడెంట్) తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. క్రీస్తుశకం 1434 నుంచి 1541 వరకు సూర్యవంశపు ఒడియ రాజుల పాలన గురించి చలనచిత్ర ప్రదర్శన ద్వారా వివరించారు. వడ్డెర్ల సుస్థిర జీవన స్థితిగతులు, ప్రభుత్వాల సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డెర్ల ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా, ఆంధ్ర రాష్ట్రంలో వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. వడ్డెర కార్పొరేషన్‌కు రూ. 250 కోట్ల నుంచి రూ. 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని, మైనింగ్ గనులలో వడ్డెర్లకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని, కాంట్రాక్టు పనులలో 15 శాతం నామినేషన్ పద్ధతిన డిపాజిట్ లేకుండా కేటాయించాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి సమర్పించనున్నట్లు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు తెలిపారు.
ఈ సమావేశంలో కుంచపు శ్రీనివాసులు (జిల్లా ప్రచార కార్యదర్శి, కర్నూలు జిల్లా ఒడియ రాజుల సంక్షేమ సంఘం), డేరంగుల లక్ష్మీనారాయణ (జిల్లా వడ్డెర సంఘం నాయకులు), కుంచపు జానకిరామ్ (రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు), పల్లపు నాగేశ్వరరావు (జిల్లా వడ్డెర సంఘం నాయకులు), శిల్పి సుబ్బరాయుడు, బ్యాంకు నాగరాజు, గుంజా వెంకటస్వామి, డీవీ చంద్ర, వెంకటేశ్వర్లు, భైరవ, నడిపి వెంకటేశ్వర్లు, బట్టల అంగడి సుబ్బరాయుడు, బ్రహ్మంగారిమఠం నుండి రామాంజనేయులు, చంద్రిక, శిల్పి రాజు, పలుకూరు శివకృష్ణ, బత్తుల పృథ్వీరాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..