హుజురాబాద్‌లో వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్‌లో వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం

హుజురాబాద్: గ్లోబల్ షో టో కాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ పర్యవేక్షణలో ఈ తరగతులు స్థానిక న్యూ కాకతీయ మోడల్ స్కూల్‌లో ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి.
పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ఆటల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కరాటే ఒక చక్కని ప్రత్యామ్నాయమని కరాటే మాస్టర్ జలీల్ అభిప్రాయపడ్డారు. కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌తో పాటు క్రమశిక్షణ అలవడుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ పెంచడానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కరాటే ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు ఒక మంచి మార్గం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చదువుతోపాటు మనసు యొక్క ఏకాగ్రత, శారీరక దృఢత్వం మరియు స్వీయ రక్షణకు కరాటే ఒక ముఖ్యమైన సాధనమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఎక్సైజ్ ఎస్సై వినోద్ మాట్లాడుతూ, కరాటే శిక్షణ క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేస్తుందని తెలిపారు. నేటి పిల్లలకు చదువుతోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని, విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ఆప్కారి ఎస్సై వినోద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, ఏఎంసి మాజీ డైరెక్టర్ మొహమ్మద్ ఖాళీద్ హుస్సేన్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు సమ్మయ్య,మైనార్టీ సోషల్ మీడియా కన్వీనర్ లక్ష్మణమూర్తి తదితరులు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్‌ను అభినందించారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !