బాహు బలంన్యూస్ కమలాపూర్ ప్రతినిధి ఏప్రిల్ 28:
కమలాపూర్ వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూర్ రైతు వేదికలో కేన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి మధులిక, డిస్టిక్ మేనేజర్ రంజిత్ కుమార్, సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి, కేఎన్ బయోసైన్సెస్ జీఎం హేమంత్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారి మధులిక మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు రైతులకు భవిష్యత్తులో 100% భరోసా ఇస్తుందని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.
కేన్ బయో సెన్సెస్ డిస్టిక్ మేనేజర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, రైతులు మరింత విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ టన్ను ధర రూ.21,000 ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒకటి భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో, మరొకటి ఎల్కతుర్తి మండలం బావుపేట లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. త్వరలోనే ములుగులో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కూడా నిర్మిస్తామని ఆయన తెలిపారు.
సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి ఎరువులు మరియు నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ తోటలకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు మరియు డ్రిప్ ద్వారా ఎరువులు అందించే విధానం గురించి వివరించారు. ఆయిల్ ఫామ్ సాగు చట్టబద్ధమైనదని, రైతులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి మధులిక, కేన్ బయో సైన్స్ ప్రతినిధి హేమంత్ కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్ రంజిత్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ మహిపాల్, ఏఈఓ ప్రశాంత్ మరియు పలువురు ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు.
