శాలపల్లి-ఇంద్రానగర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గద్ధల శ్రీధర్ నియామకం

బాహు బలంన్యూస్ హుజురాబాద్,ప్రతినిధి ఏప్రిల్ 20 – హుజురాబాద్ మండలంలోని శాలపల్లి-ఇంద్రానగర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గద్ధల శ్రీధర్ నియమితుల య్యారు. ఈ నియామకం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి  వొడితల ప్రణవ్ బాబు  ఆదేశాల మేరకు, హుజారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  కొల్లూరి కిరణ్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా మండల ప్రెసిడెంట్ పుల్ల రాధ, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉమాపతి రావు, తునికి రవి, బండారి సదానందం, మరియు గ్రామ నాయకులు జయరాజ్, శివారెడ్డి, స్వరూప, విద్యాసాగర్ రెడ్డి, బిక్షపతి, మహేందర్, శ్రీను, అనిల్, నారాయణ, రమేష్, దామోదర్, సంపత్, ఐలయ్య, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !