బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి
ఏప్రిల్ 17,2025: తెలుగుదేశం పార్టీ (తెదేపా) హుజురాబాద్ నియోజకవర్గంలో గురువారం సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆడక్ కమిటీ సభ్యులు పర్లపల్లి రవీందర్, ఎస్.కె. ఫయాజ్, మండలాధ్యక్షుడు లింగారావు, పట్టణ అధ్యక్షుడు రామగిరి అంకుస్, ఆడెపు రవీందర్, బత్తిని సంజీవ్, మాడిశెట్టి అశోక్, కామనీ రాజేశం, జూపాక మల్ రెడ్డి, కాట్రపల్లి రమేష్, ప్రతాప్ రాజు, శివ తదితర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెదేపా కార్యకర్తలు, అభిమానులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమం హుజురాబాద్ నియోజకవర్గంలో తెదేపా శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది
