పోతిరెడ్డిపేటలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

bahubalamtv Reporter
bahubalamtv.in

పోతిరెడ్డిపేటలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్,ప్రతినిధి,ఏప్రిల్ 14: పోతిరెడ్డిపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మంతెన సురేందర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, అట్టడుగు, అణగారిన వర్గాల కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన నిలిచారని తెలిపారు. అంబేద్కర్ జన్మదినాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ వైజ్ఞానిక దినోత్సవంగా ప్రకటించడం ద్వారా ఆయనను ప్రపంచ మేధావిగా గుర్తించడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు.
కు వివక్ష, అంటరానితనంపై అంబేద్కర్ చేసిన అవిరళ పోరాటాన్ని ఆయన గుర్తు చేశారు. స్త్రీ సాధికారత కోసం ఆయన నిరంతరం కృషి చేశారని కొనియాడారు. విద్యాభివృద్ధికి అనేక కళాశాలలు స్థాపించి విద్య పట్ల ఆయనకున్న మక్కువను చాటుకున్నారని తెలిపారు. అంబేద్కర్ భారత ప్రజల గుండెల్లో ఎప్పటికీ అజరామరుడుగా నిలుస్తారని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి దేవునూరి కిరణ్ కుమార్, చొల్లేటి మల్లారెడ్డి, పున్నం రాజేందర్, దేవునూరి రవీందర్, నరుకుడు ప్రభాకర్, నందిపేట పరమేశ్వర్, దేవునూరి బాబు, పొడిసెట్టి రాజ్ కుమార్, చందుపట్ల రాజేందర్, చెన్నోజు భద్రయ్య, గూళ్ల శ్రీనివాస్, మూల చంద్రశేఖర్ రెడ్డి, మామిడి రమేష్, వెన్నంపల్లి శ్రీనివాస్, బండ అజయ్, గాజుల సమ్మయ్య, చొల్లేటి రాధా కిషన్, కాలేశ్వరం కార్తీక్, చొల్లేటి హరికిషన్, గాజుల అశోక్, ఎలుకపల్లి మనీ కుమార్, శనిగరం కుమార్, చొప్పరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !