బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ప్రతినిధి:
మహాత్ముల మహనీయుల ప్రతిమలు విగ్రహాల రూపంలో ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం, శుభసూచకం అని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు అన్నారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన *పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్* ప్రతినిధులు హైదారాబాదులో శనివారం ప్రణవ్ నివాసంలో కలిసి సైదాపూర్ X రోడ్డు వద్ద దివంగత భారత ప్రధాని పీవీ నరసింహరావు విగ్రహ ఏర్పాటు ఆవశ్యకత గూర్చి ప్రణవ్ కు వివరించారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ…సమాజానికి అత్యుత్తమ సేవలు అందిస్తూ, సమాజాన్ని తమ కుటుంబగా భావించిన మహా నాయకులలో “పీవీ”ముందు వరుసలో ఉంటారని అన్నారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్పనాయకుడు పీవీ అని గుర్తు చేశారు. మహనీయుల విగ్రహలను ఏర్పాటు చేసుకోవడం వలన వర్ధమాన, భవిష్యత్ నాయకులకు వారు అందించిన మార్గాలు వీరికి స్ఫూర్తిగా ఉంటాయని హితవు పలికారు. విగ్రహా ఏర్పాటుకు పూర్తీ సంపూర్ణ సహకారం ఉంటుందని, విగ్రహా ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థల ప్రతినిధులను అభినందించారు.
పీవీ సేవ సమితి అధ్యక్షుడు తూము వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పీవి వచ్చే జయంతి రోజు వరకు ఏర్పాటు కార్యక్రమాలు పూర్తిచేసుకొని పీవీ అభిమానుల సమక్షంలో గొప్పగా ఆవిష్కరణ జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు తోట రాజేంద్ర ప్రసాద్, అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి. మనోజ్ పాల్గొన్నారు.
