కాంగ్రెస్ పార్టీ 25వ వార్డు అధ్యక్షుడిగా శ్రీ గడ్డం రాఘవేంద్ర నియామకం.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ పట్టణంలోని 25వ వార్డు నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు శ్రీ గడ్డం రాఘవేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు,మ్యాకల తిరుపతి, హుజురాబాద్ పట్టణంలోని 25వ వార్డు అధ్యక్షునిగా నియమిస్తూ శని వారం నియామక పత్రం ఆయనకు అందజేశారు.పార్టీలో రాఘవేంద్ర కు ఉన్న సుదీర్ఘ అనుభవం, కార్యకర్తలతో ఆయనకున్న అనుబంధం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుం దని గతంలో బూత్ ఇన్చార్జిగా,సమ్మక్క సారక్క కమిటీ డైరెక్టర్ గా విధులు నిర్వహించాడనిపట్టణ అధ్యక్షుడు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంలో రాఘవేంద్ర కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన
రాఘవేంద్ర ను పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందించారు. రాఘవేంద్ర మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, వార్డులో పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మ్యాకల తిరుపతి పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మండల అధ్యక్షుడు, కొల్లూరి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !