బాహు బలంన్యూస్ సైదాపూర్ ప్రతినిధి ఏప్రిల్ 05: మండలంలో బాబు జగ్జీవన్ రామ్118 వ జయంతి వేడుకలు మండల కేంద్రంలో పాత బస్టాండ్ వద్ద సామాజికవేత్త మరియు “మీ కోసం నేను ఫౌండేషన్” వ్యవస్థాపకులు గాదెపాక కుమార్ రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పలువురు రాజకీయ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పిం చారు.ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. అణగారిన వర్గాల కోసం బాబూ జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పరిషత్ వెంకట్రాజామ్, మాజీ సర్పంచ్ లక్ష్మీ నారాయణ,మాజీ ఎంపీటీసీ మట్టల రవి,ఎమ్మార్పీఎస్ ఎంఈఎఫ్ జాతీయ నాయకులు మొలుగూరి మొగిలి, సీనియర్ బిసి నాయకులు మరియు సామాజిక సేవకులు గున్నాల కృష్ణమూర్తి గౌడ్,సీనియర్ న్యాయవాది తిరుపతి, మాజీ వార్డు సభ్యులు సైదాపూర్ పొడిషెట్టి అజయ్ బోనగిరి రాములు, గొల్లపల్లి రాజయ్య బిస్సా రాజు,బోరగాల మధు, రాజేందర్, వేముల చంద్రయ్య గాదెపాక కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
