బాహు బలంన్యూస్ హుజురాబాద్,ప్రతినిధి ఏప్రిల్ 04
నూతనంగా ఎన్నికైన హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కాయిత రాములు, కామని రవీందర్ లను హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాకర్స్ అధ్యక్ష, కార్యదర్శులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల గోవర్ధన్ మాట్లాడుతూ… ప్రెస్ క్లబ్ అధ్యక్ష ,కార్యదర్శులుగా ఎన్నికైన రాములు, రవీందర్ లు పాత్రికేయ రంగంలో మరింత ముందుకు వెళ్లాలని కోరారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించే వార్తలు ప్రచురించాలని సూచించారు. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లోని జర్నలిస్టులందరు ప్రతిరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయుల సంక్షేమం కోసం తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ లు తాళ్లపల్లి శ్రీనివాస్, పైల్ల వెంకట్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ నాయకులు రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మతీన్, ప్రతాప రమేష్ ,దొరయిరాజు, వెంపటి సతీష్ , రామగిరి అంకుష్, సందీప్ ,శ్రీనివాస్, సతీష్,తదితరులు పాల్గొన్నారు.
