ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.

బాహుబలం హుజురాబాద్ ప్రతినిధి / మార్చి 29: ముస్లిం ల పవిత్ర పండుగ రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం హుజరాబాద్ నియోజకవర్గం లోని సాయిరూప ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ ను ఎంతో భక్తి శ్రద్ధతో ముస్లిం సోదరులందరూ జరుపుకుంటారని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ సోదరా భావంతో ఉండాలని, అన్నారు. రంజాన్ రోజు ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులకు సూచిస్తానని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రంజాన్ సమయంలో పేద ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున కొత్త దుస్తులతో కూడిన రంజాన్ తోఫాను అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ, ఎమ్మార్వో, మరియు ముస్లిం పెద్దలు తో పాటు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !