బాహు బలం న్యూస్ రామగుండం ప్రతినిధి:మార్చ్ 29.
రామగుండం నియోజకవర్గం ప్రెస్ క్లబ్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా సాగాయి.డీజేఫ్ జాతీయ,రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కోల శ్రీనివాస్,పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్ లు హాజరై ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.ఈ ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా పోతుల జానయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పోతుల జానయ్య (జాన్ ) మాట్లాడుతూ…రామగుండం నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్,డీజేఫ్ ప్రతిష్టతకు, ఉనికికి,విస్తృతికి కృషి చేయడమే కాక, జర్నలిస్టుల హక్కులు, మౌలిక సౌకర్యాలు, సమస్యలపరిష్కారం, జర్నలిస్టుల పట్ల అక్రమకేసుల బనాయీంపులను, దాడులను ఎదుర్కోవడం, తదితర అంశాలపట్ల ప్రెస్ క్లబ్ నాయకత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు.నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షలు పోతుల జానయ్య ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
