ఆనోందత్సవాల నడుమ అల్ఫోర్స్ జీనియస్ స్కూల్ “ఆనందోస్తావ్” పాఠశాల వార్షికోత్సవ వేడుకలు.

బాహుబలం న్యూస్ హుజురాబాద్,ప్రతినిధి:మార్చి 29: విద్యార్థులకు నైతిక విలువలతో పాటు విద్య చాలా అవసరమని మరియు విద్య ద్వారా విజయాలను నమోదు చేయడమే కాకుండా జీవితంలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ లోని ఒక ప్రైవేటు వేడుక మందిరంలో “ఆనందోత్సవ్” పేరుత ఏర్పాటు చేసిన అల్ఫోర్స్ జీనియస్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ప్రారంభానికి ముందు వారు చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి సాంప్రదాయపద్ధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జ్యోతి ప్రజ్వల నతో వేడుకగా ప్రారంభించారు‌.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ లక్ష్యాల ను ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులను సంతృప్తి పరచాలని అన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థలు గత 35 సంవత్సరాలుగా విద్యారంగానికి ఎనలేని సేవలు చేయడమే కాకుండా ఎంతో మంది విద్యార్థులకు అత్యుత్తమ భవిష్యత్తును అందించి విద్యారంగానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని తెలుపుతూ విద్యార్థులకు కావల సినటువంటి అన్ని వనరులను కల్పిస్తూ వారిని వివిధ రంగా లలో నిర్వహించేటువంటి వివిధ పోటీ పరీక్షలలో మరియు ప్రతిభ పాటవ పోటీలలో అగ్రగామిగా నిలుపుతున్నామని అన్నారు. తల్లిదండ్రులు,ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకొని విజయం వైపు అడుగుల వేపించే బాధ్యత నిర్వర్తిం చి సమాజాభివృద్ధికి చేయూతనివ్వాలని విన్నవించారు.వేడు కలలో భాగంగా విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు,తల్లిదం డ్రులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !