అంబేద్కర్ 134వజయంతి కమిటీ అధ్యక్షుడి గా మారేపల్లి శ్రీనివాస్ ఎన్నిక .

బాహు బలంన్యూస్, హూజురాబాద్ ప్రతినిధి మార్చి 26:

హుజురాబాద్ పట్టణంలో BSR గార్డెన్ లో మంగళవారం రోజున అంబేద్కర్ 134 వ జయంతి కమిటీ ఎన్నిక సమావేశం మాజీ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మహమ్మద్ కాలిక్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా, కుల సంఘాల నాయకులు అంబేద్కర్ వాదులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో 134 వ అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షుడిగా మారేపల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఆలేటి రవీందర్ , రుద్రారపు రామచంద్రం, బొరగాల సారయ్య, డాక్టర్ తడికమళ్ళ శేఖర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా ఎన్నికైన మారేపల్లి శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మరియు ప్రజాసంఘాల నాయకులు సొల్లు బాబు, కొండ్ర నరేష్ , కొలిపాక శంకర్, చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, ఎర్ర రమేష్, తునికి సమ్మయ్య, తునికి వసంత్ , ఎర్ర శ్రీధర్, రొంటాల రాజ్ కుమార్, ఉప్పు శ్రీనివాస్ , రొంటాల సుమన్, వేముల పుష్పలత, సొల్లు సునీత, మొలుగు రాధ, ఎర్ర రాజ్ కుమార్, ఎర్ర నాగరాజు, మొలుగు శ్రీనివాస్, సందెల వెంకన్న, మట్టేడ ప్రకాష్, కలవల మల్లయ్య , మొలుగూరి ప్రభాకర్, రామ్ రాజేశ్వర్ , బొడ్డు ఐలయ్య , తదితరులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు . అంబేద్కర్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రచారం చేయాలని ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !