బాహుబలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల వన్నారం గ్రామంలో
వన్నారం గ్రామం నుంచి గంగిపల్లి గ్రామ ప్రథాన రహదారిలో గల గంగిపల్లి గ్రామ శివారులో నెలకొన్న భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయ కమాన్ ఆర్చి నిర్మాణానికి వన్నారం గ్రామ ప్రథాన రహదారి ముఖ ద్వారం వద్ద బుధవారం వన్నారం గ్రామ ప్రజల అట్టహాసంగా భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి నిర్మాణానికి ఖర్చయ్యే దాదాపు నాలుగు లక్షల రూపాయలు గ్రామస్తులే స్వచ్ఛందంగా విరాళాల రూపంలో సమకూర్చుకోవడం విశేషం.ఈ కార్యక్రమం లో వన్నారం గ్రామానికే చెందిన సీనియర్ సిటిజన్ రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు పోలాడి రామారావు గ్రామ పంచాయతి సెక్రటరీ శారద, మాజీ సర్పంచులు భాకారపు శ్రీనివాస్, మద్దెల లక్ష్మయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ చలిగంటి ఓదెలు,మాజీ ఎంపీటీసీ గంగుల రవి, మాజీ ఉపసర్పంచులు బకారపు తిరుపతి, బుద్దుల తిరుపతి, సీనియర్ సిటిజన్లు పోలాడి యాదగిరిరావు, సంబ కొమురయ్య, తాల్లపల్లి కొమురయ్య , ఒడ్నాల బాలింగం, పోలాడి ప్రభాకర్ రావు, ఆకునూరి లచ్చయ్య , మద్దెల స్వామి, శివరాత్రి కొమరయ్య, బాకారపు ఓదెలు, బాకారపు మల్లేష్, మద్దెల చంద్రయ్య, బొంపెల్లి స్వామి, రావుల అశోక్,పూజారి సంతోష్ తదితరుల తో పాటు గ్రామ పంచాయతి ఉద్యోగులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహ భరితంగా పాల్గొని దేవాలయ కమాన్ ఆర్చి నిర్మాణపనులు ప్రారంభించారు.
