శ్రీ చైతన్య సీబీఎస్ఈ సిఓ-ఐపీఎల్ బ్రాంచ్లో అట్టహాసంగా జాతీయ సైన్స్ దినోత్సవం..

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ కొత్తపల్లి మండలంలోని చింతకుంటలోని శ్రీ చైతన్య సీబీఎస్ఈ సిఓ-ఐపీఎల్ బ్రాంచ్ లో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఎక్స్పో ముఖ్యఅతిథిగా హాజరైన అసోసియేట్ ప్రొఫెసర్ వంగల శ్రీనివాస్ (డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్) ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాల, ప్రిన్సిపాల్, రాజ్ కుమార్ ఆచార్య, వైస్ ప్రిన్సిపల్ లీలావతి, సిఓఐపీఎల్ ఇన్చార్జ్ శ్రీకాంత్ రెడ్డి, సిఇన్చార్జ్ జయ వర్ధన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజకుమార్ ఆచార్య మాట్లాడుతూ… జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పాఠశాలలో సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సైన్స్ లేనిదే ఈ విశ్వం లేదన్నారు. ఆ ప్రయోగాలు ఫలితాలను నేటి సమాజం అనుభవిస్తుందన్నారు. అనేక ఆవిష్కరణల మూలంగా ప్రపంచం ఒక క్రమంగా మారిందని, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలను ఆకాశ ప్రయాణంలో చుట్టి వస్తున్నామన్నారు. కంప్యూటరీకరణ వలన అనేక అంశాలు క్షణంలో పరిష్కారం అవుతున్నాయన్నారు. ఇంటర్నెట్ వృద్ధి వలన జ్ఞాన సమూపార్జనకు మరింతగా అవకాశం ఏర్పడిందన్నారు. జీవశాస్త్రంలో జరిగిన అనేక పరిశోధనలు మూలంగా వైద్యరంగంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఒకప్పుడు సరైన వైద్యం సౌకర్యం లేక అనేకమంది ప్రజలు వ్యాధులతో ఇబ్బందులు పడ్డారని, మానవుల జీవన విధానం వలన కరోనా వైరస్ ను ఎదుర్కోగలిగామన్నారు. ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్, లేజర్ సెక్యూరిటీ అలాం సిస్టం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోషన్, మలేరియా టెస్ట్, ఆసిడ్స్ రియాక్షన్ విత్ మెగ్నీషియన్ రిబ్బన్, ఆటం మోడల్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ సిస్టం, ఫైర్ సేఫ్టీ సిస్టం, వాటర్ డిస్పెన్సర్, వాల్కేనర్ ఎబిషన్, లేజర్ సెక్యూరిటీ సిస్టం, వాటర్ ప్యూరిఫైయర్, ప్రీ ప్రైమరీ లో సైంటిస్ట్ డాక్టర్, టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ సెన్స్ ఆర్గాన్స్, మైక్రోస్కోప్, రాకెట్ వర్కింగ్ మోడల్ దాదాపు 400 పైగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎక్స్పోజింగ్ ప్రదర్శించారు. అనంతరం వివిధ తరగతుల విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనలు తయారుచేసి వాటి గురించి వివరించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులందరికీ బహుమతులు ప్రధానం చేశారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు, ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమ, జిఎం నాగేంద్ర, చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, కరీంనగర్ జోన్ ఏజిం ఏం రాజు, డివిజనల్ మేనేజర్ సదాశివ రెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రవీణ్, ప్రీ ప్రైమరీ ప్రైమరీ కోఆర్డినేటర్లు సరిత, మహాలక్మి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏవో కిషన్ రెడ్డి, ఔట్సోర్సింగ్ ఇంచార్జ్ రంజిత్, క్యాంపస్ ఇంచార్జ్ నాగేంద్ర, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !