ఘనంగా శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ ఎక్స్పో… హుజురాబాద్:

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 28:
హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో కరిక్యులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాలుగో తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు వివిధ రకాలైన సైన్స్ ప్రాజెక్ట్స్ ని ముఖ్యంగా వర్కింగ్ మోడల్స్ ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్ల సందీప్ కుమార్ మాట్లాడుతూ.. సైన్స్ అంటే నాలెడ్జ్ అని, సైన్స్ లేనిదే ఈ సృష్టి లేదన్నారు. ప్రతి ఒక్కరు వారి జీవితంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకునేలా ఎదగాలని, ప్రతిదాన్ని చూసి తమలో తామే ప్రశ్నించుకునే తత్వాన్నిపెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే క్విజ్ అలాగే పోటీలు, శాస్త్రాన్ని ప్రోత్సహించేలా క్విజ్, ఎస్సే రైటింగ్, అలాగే డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల శాస్త్ర పరిశోధనలను మెచ్చుకుని ఉత్తమ ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసి అభినందించారు.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధనా దృష్టిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. శాస్త్రం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం విద్యార్థుల ముఖ్య బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు,నిర్వాహకులందరికీ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం ముద్రగోల రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్, డీన్ శ్రీనివాస్, రజిత, స్రవంతి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !