ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం. పి డి ఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్…

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ ఫిబ్రవరి 24;:
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలనీ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన పి డి ఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ .ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యా పూర్తిగా వ్యాపారమయమైంది. గల్లి గల్లికి మోడల్ స్కూల్స్,ఈ టెక్నో ,ఫౌండేషన్ ,ఈ-టెక్నో, డిజీ, మెడిసిన్,ఐఐటి ఫౌండేషన్, సివిల్స్ లాంటి తోక పేర్లు తగిలించుకొని యదేచ్చగా లక్షల్లో ఫీజులు వసూళ్లకు పాల్పడుతుంటే సంబంధిత విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఒకే పాఠశాల పేరుతో సబ్ క్యాంపస్ లను కనీస వసతులు లేకుండానే పాఠశాలలను ప్రారంభిస్తు న్నారు. ఉపాధ్యాయ అర్హతలు లేకుండానే టీచర్లుగా నియమించుకుంటున్నారు. రేకుల షెడ్ల నుండి మొదలుకొని, అప్ స్టేర్ బిల్డింగ్ లలో తరగతి గదులను నిర్వహిస్తున్నారు. ఈ రెండు విద్యా నియమాలకు విరుద్ధమైనవి. విద్యార్థుల కు ప్రమాదకరమైనవి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా త్రాగడానికి నీరు, వాష్ రూమ్స్, తరగతి గదులలో ఫ్యాన్లు, వెలుతురు లేకుండానే చీకటి గదుల్లో వేలాది మంది విద్యార్థులను విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందుల కు గురి చేస్తున్నారు. విద్యార్థులకు కల్పించాల్సి న సౌకర్యాల పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ నాసీ రకమైన విద్యని అందిస్తూ వేలల్లో , లక్షల్లో ఫీజులను విపరీతంగా దండుకుంటున్నారు. మరోపక్క విద్యా సంవత్సరం ముగించక ముందే పాఠశాలు, చట్ట విరుద్ధంగా కరపత్రాలు, బ్యానర్లు,యాడ్స్ తో ప్రచారం చేస్తూ టీచర్స్ ని, కొంతమంది PRO లను ఏర్పాటు చేసుకొని అడ్మిషన్ క్యాంపియన్ చేయాలంటూ పంపిస్తు న్నారు. దీనిని పి డి యస్ యూ విద్యార్థి సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే విద్యాశాఖ అధికారులు,పేరెంట్స్ ప్రమేయంతో ఫీజులు నిర్దేశించాలని, ప్రతి ప్రైవేట్,కార్పొరేట్ పాటశాలల్లో పేరెంట్స్ కమిటీ లు నియమించాల ని, ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్న పాఠశాల చర్యలు తీసుకోవాలని పి డి యస్ యూ గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్, నాయకులు పల్లవి, ,వైష్ణవి ,వెన్నెల తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !