టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా,..మండలిలో మీ హక్కుల కోసం గొంతెత్తుతా.. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య..

ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సమస్యలపై గళమెత్తుతా?
వారి సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం..
గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరూ వారిని పట్టించుకో లేదు..

గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ ను మొత్తం భ్రష్టు పట్టించాయి.

ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తే.. పీఆర్సీ, డీఏల కోసం కొట్లాడుతా..

మండలిలో మీ హక్కుల కోసం గొంతెత్తుతా..
బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి
మల్క కొమరయ్య..

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 23: హుజురాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించా లని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థి కొమరయ్య అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని మధువన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డీఎస్సీ వేయలేదని, ప్రైవేటు కళాశాలల యా జమాన్యలకు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా అని అన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరూ మిమ్మల్ని పట్టించుకోలేదని, ఈసారి కచ్చితంగా బీజేపీ అభ్యర్థిగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఐల పరిచిన తనను గెలిపించి మండలికి పంపితే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం
అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారా నికి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని,
తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్య లు పరిష్కారం కావాలంటే  మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను భారీమెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయుడు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా పాటుపడ తానని మల్క కొమరయ్య అన్నారు. ఈ కార్య క్రమంలో టీయూపీఎస్, బీసీటీయూ, టీటీయూ తదితర సంఘాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !