ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించడం లేదు! – మాజీ మేయర్ ,రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్, కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్..

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ ఫిబ్రవరి 20:
ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించడం లేదని
మాజీ మేయర్ ,రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్, కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మీడియా సమావేశంలో సర్ధార్ రవీందర్ సింగ్ గమాట్లాడుతూ మేము ముందు నుంచే చెప్పుతూనే ఉన్నాం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ నా పై అక్రమంగా కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.నామినేషన్ సమయంలో కూడా మా వాహనాలను అడ్డగించి మంత్రుల వాహనాలను లోపలికి అనుమతించడం ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై ఇంకా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.కేవలం తన పేరు సీరియల్ నెంబర్ లో ముందు వరుసలో రావాలని కుట్రలు చేసి నరేందర్ రెడ్డి పేరును అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గా మార్పులు చేసి అన్యాయం చేశారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు .
ఎమ్మెల్సీ ఓటరు వివరాలు బహిర్గతం చేస్తున్నారని పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసిన మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్
– కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఓటరు వివరాలను బహిర్గతం చేసే vnrmlc.com అనధికార వెబ్‌సైట్‌పై భారత ఎన్నికల సంఘం కు సర్ధార్ రవీందర్ సింగ్ ఫిర్యాదు చేశారు.
– భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతా చట్టాలు మరియు ఎన్నికల డేటా భద్రతను తీవ్రంగా ఉల్లంఘించడాన్ని www.vnrmlc.com అనే వెబ్‌సైట్, వారి పేరు మరియు మొబైల్ నంబర్‌ని ఉపయోగించి గ్రాడ్యుయేట్ ఓటరు వివరాలను వెతకడానికి వినియోగదారులను చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుందని అన్నారు.
– ఈ వెబ్‌సైట్ ఎన్నికల సంఘం రికార్డుల నుండి అనధికారిక డేటాను ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తున్నందున ఈ వెబ్‌సైట్ అనేక రకాల ఆందోళనలు మరియు ప్రమాదాలను పెంచుతుందని ఆయన అన్నారు.
– ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న పూర్తి ఓటరు వివరాలు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వెబ్సైట్ లో ఏలా పొందుపరచారని ప్రశ్నించారు.
– ప్రభుత్వం , ఎన్నికల కమిషన్ రాజ్యాంగ నిబంధలను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
– ఓటరు జాబితా ను అధికారులు ఏ విధంగా అనధికార వెబ్సైట్ కు అందించారో వివరించాలని ధ్వజమెత్తారు.
– ఇది సున్నితమైన ఓటరు వివరాలను బహిర్గతం చేస్తుంది, గుర్తింపు చౌర్యం, ఎన్నికల మోసం మరియు రాజకీయ ప్రయోజనాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదానికి దారి తీస్తుందని మండిపడ్డారు.
– ఈ వెబ్‌సైట్ మహిళా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని వారి వయస్సు, మొబైల్ నంబర్, చిరునామా మరియు వృత్తితో పాటు తప్పుడు వ్యక్తుల చేతిలోకి వస్తే విషాదకరమైన పరిణామాలను కలిగి ఉంటుంది, వెబ్‌సైట్ ECI లేదా CEO తెలంగాణ నుండి ఎటువంటి అధికారిక ప్రమాణీకరణ లేదా అధికారాన్ని పేర్కొనలేదని అన్నారు.
– ఇది డేటా ఉల్లంఘనలు మరియు సైబర్ మోసాల యొక్క భారీ ప్రమాదం, ఇది తెలంగాణలోని వేలాది మంది ఓటర్లను ప్రభావితం చేస్తుంది – సర్ధార్ రవీందర్ సింగ్
– ఇలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే ఎన్నికల ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఇష్టమొచ్చినట్లు ఏకగ్రీవంగా ఎన్నిక చేయండి అంటూ సర్ధార్ రవీందర్ సింగ్ గారు మండిపడ్డారు.
– ఇవి గాంధి భవన్ ఎన్నికల లేక భారతీయ ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
– అధికారుల ప్రమేయం వల్లే ఓటరు జాబితా వివరాలు లిక్ అయ్యిందని ప్రశ్నించారు.
– లంచం తీసుకొని వ్యవహిస్తున్న అధికారులు గాంధి భవన్ లో కుర్చీ వేసుకొని కూర్చొని ఎన్నికల జరపండి అంటూ మండిపడ్డారు.
– ఇలాంటి అక్రమాలు , అన్యాయాలు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.
– ఎన్ని సార్లు కేసులు పెట్టిన ఫిర్యాదులు చేసిన పట్టించుకోని ఎన్నికల కమిషనర్ అధికారిని వెంటనే మార్చాలని కోరారు.
– www.vnrmic.com యొక్క చట్టబద్ధతను పరిశోధించండి మరియు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవలని అన్నారు.వెబ్‌సైట్ చట్టవిరుద్ధంగా ఓటరు డేటాను యాక్సెస్ చేసి షేర్ చేస్తుంటే దాన్ని షట్ డౌన్ చేయండి లేదా బ్లాక్ చేయండినీ అన్నారువ్యక్తిగత సమాచారానికి అనధికారిక యాక్సెస్ కోసం IT చట్టం, 2000 కింద కేసు నమోదు చేయలని డిమాండ్ చేశారు.
– ఓటర్ల గోప్యతను కాపాడేందుకు మరియు ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో ల్చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ విషయంపై సత్వర విచారణ జరిపించి క్రిమినల్ కేసులు పెట్టాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో న్యాయవాదులు సుంకె దేవకిషన్ , మురళీ ,లింగంపల్లి నాగరాజు,శరత్ చందర్ రావు , వినయ్,రాజ్ కుమార్ ,వేముల సందీప్,రమేష్ లక్ష్మణ్ ,తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !