ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి వితంతు ల్యాండ్ కబ్జా చేస్తున్న మేజర్ గ్రామపంచాయతీ ఉద్యోగి.

బాహు బలం న్యూస్ కమలాపూర్ జనవరి 18: కమలాపూర్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఉద్యోగి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి కమలాపూర్ చెందిన ఓ వితంతు భూమి కబ్జా చేస్తున్న విషయం. తాజాగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకెళితే కమలాపూర్ మండలానికి చెందిన శనిగరపు లచ్చమ్మw/o కీ.శే. యాదగి రి.కు చెందిన కమలాపూర్ శివారులో భూమిని ఒస్కుల రమేష్ s/o రాజీరు కమలాపూర్ గ్రామానికి చెందిన మేజర్ గ్రామ పంచాయతీ ఉద్యోగి శనిగరపు లచ్చమ్మ, w/o కీ.శే.యాదగిరి. తనకున్న భూమి సర్వే నంబర్ 848(0.20) గుంటల భూమి ఉన్నది.ఆ భూమి కి తనకు కున్న పూర్తి హక్కులతో తన కుమార్తె మరియు కుమారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. గతంలో2008 సం||లో నా భర్త ఆసుపత్రిలో ఉన్న సమయంలో నా పెద్ద కుమారుడు శనిగరపు రమేష్ బాబు s/o యాదగిరి ఒస్కుల రమేష్ S/o రాజీరు. వద్ద నగదు 30,000/- రూపాయలు తీసుకోవడమైనది. కానీ ఆ నగదు క్రింద భూమి ఇవ్వాలి లేకుంటే ఇప్పుడే నా డబ్బులు నాకు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేశాడు. వరిపంట రాగానే చెల్లిస్తామని చెప్పినా ఒస్కుల రమేష్ s/o రాజీరు వినిపించు కోలేదు. అప్పుడు శనిగరపు లచ్చమ్మw/o కీ.శే. యాదగిరి పెద్ద కుమారుడు శనిగరపు రమేష్ బాబు ను నగదు 30,000/- మరియు వడ్డీ 8,000/- రూపాయ లకే ఒక గుంట భూమి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఒక గుంట ధర 1)1,00,000/- 2) 75,000/- 3)50,000/- 4)45,000/- రూపాయలు అని చెప్పిన ఆ ధర ప్రకారం నాకు అవసరం లేదు అని ఒస్కుల రమేష్ s/o రాజీరు అన్నారు.కాగా ఒక నెల రోజుల తర్వాత వచ్చి నాకు ఒక గుంట వద్దు ఒక గుంటలో నాకు ఇల్లు నిర్మాణం కాదు అని రెండు గుంటల భూమి ఇస్తేనే నేను తీసుకుంటా లేదంటే నా డబ్బులు నాకు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేశాడు ఒస్కుల రమేష్.కాగా శనిగరపు లచ్చమ్మ భర్త మరణించి న అనంతరం ఒస్కుల రమేష్ కు ఇష్టం వచ్చిన ధరకే చివరగా 34,000/- రూపాయలకే ఇవ్వాలని డిమాండ్ చేసినాడు. తప్పని పరిస్థితుల్లో భూమిని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు నా పెద్ద కుమారుడు రమేష్ బాబు. డబ్బులు ఇచ్చినందున తనే పత్రం రాయించి ఇవ్వాలని తెలిపాడు. అదేవిధంగా భూమి బయానా పత్రం తేదీ:01/03/2024 సంవత్సరంలో బయానగా మిగిలిన నగదు ఒక గుంట ధర 34,000/- చొప్పున రెండు గుంటలకు మొత్తం 68,000/- రూపాయలు. కాగా బదులుగా ఇచ్చిన నగదు 40,000/- రూపాయలు ముట్టినవిఅని మిగతా నగదు 28,000/- రూపాయలు తిరిగి తేదీ :10/06/2009 రోజున ఇచ్చే ఖరారు అని గ్రామానికి చెందిన శనిగరపు సదానందం వ్రాసినారు. మిగిలిన నగదు ఇవ్వ కుండానే భూమి హద్దులను ఏర్పాటు చేయమని ఒస్కుల రమేష్ s/o రాజీరు అడిగితే మీరు మిగిలిన నగదు చెల్లిస్తేనే హద్దులను ఏర్పాటు చేస్తామని చెప్పాము.కాగా అతను డబ్బులు ఇవ్వలేదు మేము హద్దులను కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయంలోనే గొడవ జరిగింది.అప్పటినుండి నేటి వరకు ఎలాంటి మాటలు కూడా లేవు మాకు ఎలాంటి నగదు తిరిగి ఇవ్వలేదు.మేము భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు. తేది :01/03/2009 రోజు వరకు చెల్లించాల్సిన మొత్తం 28,000/- రూపాయల నగదు చెల్లించకుండానే అక్రమం గా నకిలీ పత్రం సృష్టించి అందులో తేది : 01/03/2009 రోజున శనిగరపు లచ్చమ్మ తో భూమి కొనుగోలు చేసినట్లు ఒక గుంటకు ధర 50,000/- రూపాయలు చొప్పున రెండు గంటలకు గాను మొత్తం 1,00,000/- ఒక లక్ష రూపాయ ల ధర నిర్ణయం చేశారు. కానీ నగదు ఎవరికి ముట్టినవి మాత్రం తెలుపలేదు అదేవిధంగా అందరి పెద్ద మనుషుల సమక్షంలో ధర నిర్ణయించడం అయినది అని ఉన్నది. మరియు పెద్ద మనుషుల పేర్లు వారి సంతకాలు కూడా లేవు. అలాగే పూర్తి హద్దులు కూడా లేవు మరియు విక్రయపత్రంలో దస్తూరి పేరు సంతకం కూడా లేవు. శనిగరపు లచ్చమ్మ సంతకం కూడా ఆ వేలిముద్రతో సంబంధం లేదు. నకిలీ ముద్ర వేసి విక్రయ పత్రం సృష్టించాడు. నా కుమారుడికి తిరిగి మిగిలిన నగదు చెల్లించవలసిన వాయిదా తేదీ: 10/06/2009 రోజున పూర్తిగా నగదు చెల్లిస్తేనే మేము అతనికి భూమి విక్రయపత్రం రాసి ఇవ్వాలి కానీ ఎలాంటి విక్రయపత్రం నేను గాని నా కుమారుడు గాని రాసి ఇవ్వలేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే నా కుమారుడు వ్రాయించి ఇచ్చిన భూమి బయానపత్రంలో తేదీ :01/03/2009 రోజున అదేవిధంగా ఒస్కుల రమేష్ S/o రాజీరు నకిలీ విక్రయ పత్రంలో తేదీ :01/03/2009. ఒకే రోజున నా కుమారుడు వద్ద రెండు గుంటల భూమి మరియు నా వద్ద రెండు గుంటల భూమికి మొత్తం నాలుగు గుంటలు. బయాన పత్రంలో 40,000/- రూపాయలు ముట్టినవి. నకిలీ పత్రంలో 1,00,000/- ఒక లక్ష రూపాయలు ముట్టినట్లు పత్రాలలో ఉన్న ప్రకారం మొత్తం 1,40,000/- ఇచ్చిన విధంగా ఉన్నవి. తప్పుడు విక్రయ కాగితాలు సృష్టించడమే కాకుండా అక్రమంగా నా భూమిని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా కొత్తగా 23/12/2024 రోజున ఒక ట్రిప్పు కట్రౌతును నా భూమిలో పోయించాడు. అక్రమంగా గృహ నిర్మాణం పనులకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పుడు నా పైన తప్పుడు ఫిర్యాదులు చేస్తూ మరియు కోర్టు కేసుల ద్వారా నాకు నోటీసులను పంపిస్తున్నాడు. నా భూమిని 10 సంవత్సరా లు గడిచిన తర్వాత నా కూతురు ఒంటేరు లతకు రిజిస్ట్రేషన్ చేయించి ఆరు సంవత్సరాల కాలం గడుస్తున్న ది. నాటినుండి 16 సంవత్సరాలు భూమి కోసం ఎందుకు రాలేదు,కొత్తగాహద్దులు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు, భూమి ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. తను కొనుగోలు చేస్తే ఎందుకు మోక మీద ఎందుకు లేడు, నావద్ద భూమి కొనుగోలు చేయలేదు కాబట్టే నావద్ద నుండి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మిగిలిన వారికి నేను భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది.నేటి వరకు నేను ఒస్కుల రమేష్ s/o రాజీరు కు ఎలాంటి మోసం చేయలేదు.అతనే నా భూమి పైన నకిలీ కాగితాలతో నన్ను మరియు నా యొక్క కుటుంబ సభ్యులను మానసికంగా ఆర్థికంగా ఇబ్బందు లకు గురి చేస్తున్నాడు.నేను హృదయ సంబందిత అనారోగ్యంతో బాదపడుతున్నాను. ఈ రోజు అనగా తేది: 17/01/2025 రోజున మా భూమిలో JCB యంత్రంతో నాకు కలిగిన హద్దులను తొలగించి భూమిలో వున్న మట్టిని తీసేసి భూమిని చదును చేసినాడు.ఈ భూమి నాది నీకు దిక్కున్న కాడ చెప్పుకో, రేపు ఇంటి నిర్మాణానికి ముగ్గు కూడా పోస్తా ఏమి చేస్తావో చేసుకో అని బెదిరింపు ల కు గురిచేస్తున్నాడు.తేది 17/01/2025 రోజున 100కి డయల్ చేయాగా (CASE ID: 20250000125183) పోలీస్ వారు వచ్చి ఆపడం జరిగింది. నాకు స్థానిక SI గారు గృహ నిర్మాణ పనులు చేసుకొమ్మని చెప్పాడని మాతో వాదనకు దిగితున్నాడని లచ్ఛమ్మ పేర్కొన్నారు. అతని భార్య కూడా నానాబూతులు తిడుతూ గొడవ చేస్తున్నారు.వారి కుటుంబ సభ్యులతో మాకు ప్రాణహాని ఉన్నది కావున వారి పైన తగు చట్టపరమై న చర్యలు తీసుకోవాలని మాకు తగు న్యాయం చేయగలరని కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో శనిగరపు లచ్చమ్మ w/o కీ.శే.యాదగిరి ఫిర్యాదు చేశారు.   బాధితురాలు శనిగరపు లచ్చమ్మ.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !