అర్హులకు నూతన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి… 30 వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు.

బాహు బలం న్యూస్ హుజురాబాద్:జనవరి 18
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 30 వ వార్డు విద్యానగర్ – గాంధీనగర్ లోని కాలనీలో నివసించే అర్హులైన ప్రతి ఒక్కరికి, నిరుపేదలకు నూతన రేషన్ కార్డులు, అలాగే కాలనీలో ఖాళీ స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు, ఏమీ లేని ఇల్లు కిరాయి ఉండే నిరు పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టించి గాని, లేక గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుజురాబాద్ ప్రాంతంలోని సిర్సపల్లి రోడ్డు వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూములు, ఖాళీ ఇంటి స్థలాలు కేటాయించాలని 30 వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో భాగంగా ప్రజా పాలన కార్యక్రమంలో ఇంటి ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించింద ని, దీనితో కొంతమంది ఇంటి ఖాళీ స్థలం ఉన్నవారు దర ఖాస్తులు చేసుకోగా ఇంటి ఖాళీ స్థలం లేని నిరుపేదలు దరఖాస్తులోని ఇందిరమ్మ ఇల్లు పథకం షెడ్యూల్ కాలంలో మార్క్ పెట్టలేదు. దీనితో ఇందిరమ్మ ఇల్లు సర్వే చేసే అధి కారులు మార్కు చేయని నిరుపేదల ఇండ్లలో సర్వే చేయ లేదని, ఇంటి ఖాళి స్థలం లేని నిరుపేదలు దిగులుతో ఉన్నారని అన్నారు. కాబట్టి ఖాళీ స్థలం లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమిచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి గాని, లేదా గతంలో కట్టిన డబుల్ బెడ్ రూములు కేటాయించిన తర్వాతనే మిగతా ఇంటి ఖాళీ స్థలం ఉన్న వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని, అలాగే కులగణన సర్వే ద్వారా నూతన రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం తెలిపినప్పటి కి కులగణన సర్వే సమయంలో కొంతమంది ఆయా ప్రాం తాలలో లేక ఇతర పనుల నిమిత్తం వారు ఇతర ప్రదేశాల కు పోవడం ద్వారా కొంత మంది సర్వేలో పాల్గొనలేక పోయారని అన్నారు. కాబట్టి సర్వేలో పాల్గొనని వారిని కూడా మళ్లీ సర్వే చేసి అర్హులైన వారందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా మంత్రులను, ప్రజా ప్రతినిధులను, అధికారులను అభ్యర్థించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..