తల్లిదండ్రులకు ఘనంగా షష్టిపూర్తి నిర్వహించిన తనయులు…. పలువురి అభినందనలు..

సబ్బని వెంకటస్వామి బహుబలం ప్రతినిధి హుజురాబాద్:
కోట్లు సంపాదించిన తల్లిదండ్రులను సైతం అనాధ ఆశ్రమాల్లోకి పంపిస్తున్న ఈ రోజుల్లో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఇద్దరు పిల్లలు తమ తల్లిదండ్రులకు ఘనంగా షష్టిపూర్తి నిర్వహించి పలువురికి ఆదర్శం గా నిలిచారు. వివరాల్లోకెళ్తే హుజురాబాద్ లో నివాసముంటున్న శివనాధుని వెంకటేశ్వర్లు లక్ష్మీలకు రాజేష్, భరత్ ఇద్దరు కుమారులు జ్యోత్స్న ఒక కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్వర్లు చిరు వ్యాపారం చేసి పిల్లలను పెంచి పెద్ద చేసి వివాహం చేశారు. రాజేష్, భరత్ ఇద్దరు కుమారులు పెద్ద ఉద్యోగాలు చేయలేకపోయినా చిరు వ్యాపారాలు చేస్తూ జీవన కొనసాగిస్తున్నారు. తమను అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు షష్టి పూర్తి చేసి తమ ప్రేమను చూపించారు. ముగ్గురు పిల్లల ప్రేమతో తమ తల్లిదండ్రులకు మూడు రోజులుగా హోమం తో పాటు వివిధ కార్యక్రమాలు చేస్తూ చివరి రోజు షష్టిపూర్తి నిర్వహించినందుకు తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడళ్లు రసజ్ఞ,అనుషల సహకారం గొప్పగా ఉందన్నారు. తల్లిదండ్రులకు కొడుకులు మూడు రోజులపాటు షష్టిపూర్తి నిర్వహించడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు. కొడుకులంటే మీలా ఉండాలంటూ ఆశీస్సులు అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !