తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు.. ల్యాబ్ రిపోర్ట్ విడుదల చేసిన టీడీపీ

బహుబలం ప్రతినిధి తిరుపతి
ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది.

లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకపంనలు రేపాయి.

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించింది.

జులై 8, 2024న లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించగా.. NDDB CALF ల్యాబ్ జులై 17న నివేదిక ఇచ్చింది.

అందులో లడ్డూలో వినియోగించిన పదార్థాలను వెల్లడించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో.. సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదిక ఇచ్చింది.

కాగా NDDB CALF ల్యాబ్ కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందింది. ఈ మేరకు ల్యాబ్ రిపోర్ట్‌ను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు అందజేశారు.

తిరుమల వెంకన్న స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కచ్చితంగా సీరియస్ ఎంక్వయిరీ చేస్తామని ఆయన తెలిపారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించేలా కుంభకోణానికి పాల్పడిన వారు సర్వ నాశనమైపోతారని మండిపడ్డారు.

క్వాలిటీ నెయ్యి కేజీ కొనాలంటే రూ. 1000 పైగా ఖర్చవుతుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.320కి నెయ్యి టెండర్లు పిలిచిందన్నారు. నలుగురికి నెయ్యి టెండర్‌ కాంట్రాక్టు ఇచ్చారని, క్వాలిటీ నెయ్యి రూ.320కి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..