బాహు బలంన్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 17:పట్టణానికి చెందిన ప్రజాకవి రచయిత, మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు,సంపూర్ణ ఆధ్యాత్మిక బోధన గురువు డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు జాతీయ, మరియు అంతర్జాతీయ భారత్ ప్రతిభ రత్న అవార్డుతో పాటు స్వర్ణ కంకణ దారణ అవార్డుకు ఎంపిక చేసి ఈ అవార్డును సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని, జాతీయ మరియు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని.. జై జవాన్, జై కిసాన్, జై కళాకార్ మరియు భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏ బి సి డి ఆర్గనైజేషన్.. జాతీయ అంతర్జాతీయ ఆధ్వర్యంలో సత్యం గౌడ్ కు అందజేశారు. జాతీయ అంతర్జాతీయ ఆ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు ఖాదరి వెంకట్ రమణ రావు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు రిటైర్డ్ ఐఏఎస్ మనపెళ్లి సుబ్రహ్మణ్యస్వామి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, చకిలం అసోసియన్ మేనేజింగ్ డైరెక్టర్ చెక్లిమ్ సుధాకర్, సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్, కూచిపూడి యక్షగాన నృత్య గాంధర్వ శిరోమణి అవార్డు గ్రహీత యశ్వారపు చలపతి శాస్త్రి, ఏటే టైం 54 వరల్డ్ రికార్డ్స్ పొందిన సోనాలి ఆచార్జి పెయింటర్ అండ్ సింగర్ లు సత్యగౌడ్ సామాజిక సేవలు, వారి రచనలు, ఆధ్యాత్మిక బోధనలు గుర్తించి.. వీరిని జాతీయ మరియు అంతర్జాతీయ భారత్ ప్రతిభ రత్న అవార్డుతో పాటు స్వర్ణ కంకణ ధారణ అవార్డుకు ఎంపిక చేసి, ఈ అవార్డును హైదరాబాద్ లోని రవీంద్ర భారతి మెయిన్ మీటింగ్ హాల్లో మంగళవారం రోజున సత్యంగౌడ్ కు పట్టు శాలువా కప్పి, జ్ఞాపకను అందజేసి, స్వర్ణ కంకణ దారణను దరింపజేసి, భారత్ ప్రతిభ రత్న అవార్డుతో ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా సత్యం గౌడ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులతో పాటు ముఖ్య అతీతులు, వివిధ సంస్థల అధ్యక్షులు విద్యావేత్తలు మాట్లాడుతూ.. సత్యంగౌడ్ సామాజిక సేవలు, వారి సామాజిక రచనలు, ఆధ్యాత్మిక బోధనలు, ముఖ్యంగా పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థుల ప్రయోజనం కోరుతూ వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, ప్రతి విద్యార్థి ప్రయోజకుడిగా ఎదిగి, చదువుతో పాటు సమాజ సేవలో భాగస్వాములై, మనం ఏర్పరచుకున్న మానవతా విలువలు పెంపొందించుకోవాలి అనే పలు ప్రధాన అంశాల మీద సెమినార్లు ఇస్తున్న సత్యం గౌడ్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సత్యంగౌడు మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ జై కళాకార్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కదరి వెంకటరామారావు సాహిత్య సేవలు, చిన్నారులను ప్రోత్సహించే వారి నిస్వార్థ సేవాభావం ఆదర్శప్రాయం అన్నారు. వెంకటరమణారావు సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి ఏదైనా సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు సేవ దృక్పదాన్ని అలవర్చుకొని మానవ జన్మను సార్థకం చేసుకోవాలని సూచించారు. స్వలాభం సంతృప్తి ప్రధానం కాదని, సాటి మనిషి మేలుకోరడంలోనే మానవత్వం దాగి ఉందన్నారు. ప్రతి ఒక్కరు, క్రమశిక్షణ ఏకాగ్రత మంచి అలవాట్లను అలవర్చుకొని, మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ, విలువైన పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో నృత్య కళాకారులు, ప్రముఖలు ప్రజా ప్రతినిధులు, సినీ, మరియు టివీ నటులు, విద్యావేత్తలు, భక్తలు ప్రొఫెసర్లు డాక్టర్లు, కళాకారులు కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.
