సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిది హుజురాబాద్
సెప్టెంబర్ 05; ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న తుమ్మనపల్లి వాసి గొడిశాల పరమేశ్ కి ప్రతి ష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జంతుశాస్త్ర విభాగంలో (పిహెచ్ డి) డాక్టరేట్ లభించింది డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూనే పరిశోధన పట్ల ఉన్న ఆసక్తితో 2017 వ సంవత్సరంలో ఉస్మానియా లో పీహెచ్ డి పరిశోధక విద్యార్థిగా చేరారు “మధ్యతరహా రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి పెంపుదల ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు౼ ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగనాయక సాగర్ మరియు మిడ్ మానేర్ డ్యాం” అనే శీర్షికతో సీనియర్ ప్రొఫెసర్ రెడ్యానాయక్ పర్యవేక్షణలో సమర్పిం చిన పరిశోధన గ్రంథానికి గాను పీహెచ్ డి పట్టా పొందారు ఇందుకు సంబంధించిన తను రాసిన పరిశోధన పత్రము 2022 ఆగస్టు నెలలో నెద ర్లాండ్స్ కు చెందిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైన్స్ జర్నల్ గార్టెరియా లో ముద్రించబడినది. తుమ్మనపల్లి గ్రామంలో పుట్టి విద్యలో అత్యున్న త స్థాయి పట్టా అందుకున్న పరమేశ్ ను అతని తల్లిదండ్రులు మరియు గ్రామంలోని పలువురు అభినందించారు. గత ఆరు సంవత్సరాలుగా హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సేవలం దిస్తున్న పరమేశ్ ఇటీవలే సాధారణ బదిలీలపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వరంగల్ కు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి ఇందిరాదేవి మరియు అధ్యాపకులు ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపా రు. 2004వ సంవత్సరంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందిన తను ఇప్పుడు అదే జంతు శాస్త్ర విభాగం నుండి పీహెచ్ డి పట్టా అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ఈ పరిశోధనలో తనకు సహకరించి న సహ ఆచార్యులు, మిత్రులు, శ్రేయోభిలాషు లకు పరమేశ్ కృతజ్ఞతలు తెలిపాడు.










