కాసేపట్లో పెళ్లి అనగా తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి- ఆరుగురికి గాయాలు.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ :హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామము వద్ద ఘోర రోడ్డు ప్రామాదం జరగడంతో ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి.ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు, ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామము నుండి ఆటోలో కొత్తగట్టు గ్రామములోని మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఉదయము నాలుగున్నర గంటలకు తాడూరి హనుమయ్య కొడుకు రవీందర్ వివాహానికి వెళుతుండగా సింగాపూర్ గ్రామము వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందనీ కేసు నమోదు చేసుకుని కాట్రపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్షేతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా ప్రమాదం జరిగిన వద్దనే తాడూరి రాజమౌళి మృతి చెందగా అతనిని హుజురాబాద్ మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో తాడూరి హనుమయ్య, తాడూరి తిరుపతి, తాడూరి ధర్మయ్య, తాడూరి గంగాధర్ లను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తాడూరి ధర్మయ్య, తాడూరి హనుమయ్య సీరియస్ గా ఉన్నారన్నారు. వీరంతా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా రోడ్డు ప్రమాదానికి గురి కావడం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

దళిత బంధు పేరిట దగా చేసిన బీఆర్ఎస్.. దళితులకు అన్యాయం చేసిన మోసగాళ్ళు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా.. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి తెలిసే అంతా జరిగింది. దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు. మతి భ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి. బతుకంతా వివాదాలే టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !