ఆల్ఫోర్స్ లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి
హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫో ర్స్ జీనియస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పండుగల సంస్కృతిని ప్రతిబింబిస్తూ,కృష్ణాష్టమి ముందస్తు వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. చిన్న పిల్లందరూ బాల కృష్ణుడు, గోపికల వేష ధారణతో తమ ముద్దు ముద్దు మాటలతో చూపరులను ఆకర్షించారు.సాంస్కృతిక కార్యక్రమాలతో,ఆటపాటలతో అలరించారు.శ్రీకృష్ణుని దశావతారాల ప్రదర్శన కన్నులకు కట్టినట్లు చూపించారు. రాధాకృష్ణులుగా చిన్నారులు సందడి చేశారు.భగవద్గీతా పఠనం చేయించారు. పండుగ సంప్రదాయంలో భాగంగా కోలాటం ఆడి ఉత్సాహ భరితంగా ఉట్టికొట్టే కార్యక్రమం చేపట్టారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు,పండుగ విశిష్టతల గురించి తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని పునరుద్ధరించటానికి నన్ను నేను సృష్టించుకుంటానని శ్రీకృష్ణు డు అర్జునిడికి తెలిపాడని అన్నారు.భారత యుద్ధంలో పాండవుల పక్షాన ఉండి ధర్మాన్ని గెలిపించి అధర్మంగా వ్యవహరించిన కౌరవుల ఓటమికి కీలకపాత్ర వహించాడని తెలిపారు.భూలోకంలో ధర్మం గతి తప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తుంద న్నారు.శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.


Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..