మహర్షి నారాయణ్ గురు166వ జయంతి.జై భీములు

బాహు బలం ప్రతినిధి

దేవుడి ని అతిసామాన్యుని వద్దకు తీసుకుని వచ్చి, దేవుడికి కుల మత భేదాలు లేవని నిరూపించిన మహా దార్శనికకులు మహర్షి నారాయణ్ గురు.ఆయన దేవాలయాలు భక్తి, ముక్తి కేంద్రాలుగా కాకుండా మలచిన మహాశిల్పి సాహసికులు.

మానవులను అనాదిగా పట్టి పీడిస్తున్న అంధకారాన్ని ఙ్ఞానంతో తొలగించ వచ్చని, ఙ్ఞానం విద్యతోనే సాధ్యమని భావించి, అతి సామాన్యునికి చదువందించేందుకు అలుపెరుగని కృషి చేసిన మహా యోగి ఆయన.
విద్య ద్వారానే స్వేచ్ఛ… సంఘటిమవడం ద్వారా శక్తి… చదువు అనేది స్వేచ్ఛ, సమానత్వాలను సాధించుకునేందుకు నిచ్చెనలా ఉపయోగపడుతుందని ప్రభోదించిన మహాగురువు నారాయణ్ గురు.
మహాఙ్ఞాని, తత్వవేత్త అయిన మూల్ నివాసీ నారాయణ్ గురు కేరళ రాష్ట్రం విద్యలో దేశం లోనే ప్రధమ స్థానం లో ఉండడానికి ప్రధాన కారణం.

కేరళ రాజధాని తిరువనంతపురానికి 11 కిలోమీటర్ల దూరంలో చంపళంతి అనే గ్రామంలో 1856 ఆగస్ట్ 20వ న మాధవ్ ఆశవ్, కుట్టి అమ్మ లకు నారాయణ్ గురు జన్మించారు. తండ్రి మధ్య తరగతి రైతు, తల్లి ఇల్లాలు. ముగ్గురు ఆడపిల్లల అనంతరం నారాయణ్ గురు జన్మించారు. కేరళ రాష్ట్రంలో దేశంలోని అన్ని ప్రాంతాలలో వలే కుల వివక్ష తీవ్రంగా ఉండేది. కేరళలో బ్రాహ్మణ నంబూద్రీలు, నాయర్ల వంటి ఆధిపత్య కులాలు శూద్రులు అతిశూద్రుల పై అస్పృశ్యత పాటించే వారు.

నారాయణ్ గురు ఈ వివక్ష చూసి సహించలేక పోయే వారు. అందుకే బ్రాహ్మణాధిపత్యం లోని దేవాలయాలకు పోటీగా స్వంత దేవాలయాలు నిర్మించి ఒక విప్లవానికి తెరతీశారు. స్వయంగా వేదాలను హిందూ ధర్మశాస్త్రాలను ఔపాసన పట్టారు.

పెద్దలు ఆయన ఇష్టం తో పనిలేకుండా మేనరికం అమ్మా యి కాళిఅమ్మ తో వివాహం నిశ్చయించారు. ఆనాటి సాంప్రదాయం ప్రకారం ఒకసారి అత్తారింటికి వెళ్లి భోజనం చేయాలి. అలా చేయకుండా కాళిఅమ్మ వద్ద శెలవు తీసుకుని దేశాటనకు వెళ్లారు

కేరళ రాజధాని తిరువనంతపురానికి దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో గల అలువిప్పురం అనే గ్రామంలో 1888 మహా శివరాత్రి రోజున ఉదయం ఒక శివలింగాన్ని వేలాది మంది భక్తుల మధ్య ప్రతిష్ఠించారు. ఇది బ్రాహ్మణ పూజార్లకు సవాల్. ఇది ఒక సరికొత్త సామాజిక విప్లవానికి నాంది పలికింది..

ఈ సంఘటన సహించలేని బ్రాహ్మణులు నారాయణ్ గురును నిలదీయగా, ఈ శివుడు మీ శివుడు కాదనీ మా శూద్రుశివుడని వారు నిర్ఘాంత పోయే సమాధానం చెప్పారు. దేవాలయాలు స్వచ్చతకు, ప్రగతి కి కేంద్రాలు గా ఉండాలని నారాయణ్ గురు భావించేవారు. దేవాలయాలకు అనుబంధ గా తోటలు, ఉపన్యాస మందిరాలు , గ్రందాలయాలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు నారాయణ్ గురు స్థాపించారు. సుమారు పది వేల పైన దేవాలయాలు స్థాపించారు.

తాను స్థాపించిన దేవాలయాలలో గుడికి అల్లంత దూరంలో ఉండి మొక్కే శూద్రులను దేవుని విగ్రహం పక్కన నిలబెట్టారు. అసలు ఆయన ఉద్దేశ్యం మెజారిటీ ప్రజల సమీకృతం చేసేందుకు, దయనీయ స్థితి నుండి, ఆత్మన్యూనతా భావం నుండి బయటకు తీసుకు రావడమే

ఒక దశ తర్వాత ఆయన శిష్యులకు ఇక దేవాలయ నిర్మాణాలు చాలని, దానికోసం ధనం వృధా చేయవద్దని కోరారు.

నారాయణ్ గురు జీవితకాల సంపాదకుని గా “వివేకోదయం” అను పత్రిక ను స్థాపించారు. కులరహిత సమాజం కోసం
కులాంతర వివాహలను, సహపంక్తి భోజనాలనూ ప్రోత్సాహించారు. 40 సంవత్సరాల సామాజికోద్యమంలో ఆయన విద్య, సమానత్వం, సమసామాజం కోసం జీవితాంతం కృషి చేశారు.ఈ మహర్షి సెప్టెంబర్ 20, 1928న మహా పరినిర్వాణం చెందారు.

ఈ దేశ మూల్ నివాసీ లందరూ నారాయణ్ గురు ను ఆదర్శంగా తీసుకుని దేవుళ్ళ, మతం పేరుతో జరిగే మోసాన్ని గ్రహించి, బ్రాహ్మణ బానిసత్వం నుండి బయటపడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ…..

జై భీమ్!
జై భీమ్ భూమి

శనిగారపు రమేష్ .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.