సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి.
హుజురాబాద్ ఆగస్ట్ 06:హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు.ప్రస్తుత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ తో సింగాపురం కుటుంబంతో చాలా సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలు కలిగిన వేముల పుష్పలత హజురాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేస్ లో అందరికంటే ముందుజ లో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ యేముల పుష్పలత విషయం లో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా పుష్పలత హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలుగా సమర్థవంతంగా పనిచేస్తూ జిల్లా పార్టీనే పలుమార్లు అభినందనలు… ప్రశంసలు అందుకున్న విషయం పాఠకులకు విధితమే. గత పది సంవత్సరాలుగా తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం హవా కొనసాగినప్పటికీ… పలుమార్లు ఆ పార్టీ నుండి ఆహ్వానం వచ్చినప్పటికీ పున్బలత టీఆర్ఎస్ లో చేరడానికి ఇష్టపడలేదు. దీనికి కారణం యేముల కుటుంబం గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అంటే మక్కువ పెంచుకొని ఆ పార్టీ అధికారంలో ఉన్నను లేకున్నను కాంగ్రెస్ నే అభిమానిస్తూ ఇంత కాలంగా ఈ పార్టీలోనే యే ముల కుటుంబం కొనసాగుతున్న విషయాన్ని ఉదహరిస్తుంటారు. అందువల్లనే గత పది ఏళ్లలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వుష్పలత కాంగ్రెస్ పార్టీని వీడదానికి ఇష్టపడలేదు. విద్యావంతురాలుగా గుర్తింపు పొందిన పుష్పలత అనేక సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో టీచర్ గా పనిచేయడం ద్వారా వందలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల అభిమానాన్ని చూరగొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున జరిగే అనేక కార్యక్రమాలలో ఆమె చురుగ్గా పాల్గొనడమే కాకుండా పార్టీకి చెందిన ఇతర మహిళ సభ్యురాళ్లను సకాలంలో సమావేశాలకు తీసుకురావడంలో ఆమె ఎప్పుడూ. ముందుంటుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక మహిళా ప్రతినిధులలో అనర్గళంగా మాట్లాడే నేతగా పుష్పలత పార్టీ సీనియర్ నాయకుల చేత పలుమార్లు ప్రశంసలు అందుకున్నారు. ఆమె కుమారుడు జాతీయస్థాయి క్రీడాకారునిగా ఇప్పటికీ మంచి గుర్తింపును..పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న విషయం పాఠకులకు విధితమే. పుష్పలత భర్త యేముల రవికుమార్ పిఈటి గా ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోగల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు పార్టీ పదవులను దక్కించుకోవడానికి ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. పదవుల పంపకంలో జిల్లా మంత్రుల ప్రమేయం అధికంగా ఉంటుందనే ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ విషయంలో తామెందుకు బదనాం కావాలి… నియోజకవర్గ ఇన్చార్జిలు ఫైనల్ చేసే అభ్యర్థుల పేర్లను అంతిమంగా అధిష్టానం ద్వారా ప్రకటింపచేయా లని మంత్రులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక్కడ ప్రస్తావించవలసిన విషయం ఏమిటంటే హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించబడి నట్లు తెలుస్తోంది. పక్కనే గల జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించినట్లు సమాచారం.ఈ రకంగా చూస్తే జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సి వర్గాని కి చెందబోతోందన్న విషయం నగ్నసత్యం.హుజురాబాద్ మార్కెట్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించి అందుకు విరుద్ధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వేముల పుష్పలతకు హుజూరా బాద్ చైర్మన్ పదవిని ఇస్తారా అనే విషయంలోనే సందేహాలు వ్యక్తం అవుతున్నా యి.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారా యణ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ యేముల పుష్పలత విషయంలో సానుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడు అందరి దృష్టి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ వైపు కేంద్రీకృత మైంది.ఆయన ఎవరి పేరును చివరి నిమిషంలో ఓకే చేస్తారో వేచి చూడవలసిం దే. ఇప్పటివరకు అయితే యేముల పుష్పలత పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం దాదాపు ఆమే పేరే ఫైనల్ అయ్యె అవకాశం ఉందనీ కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెల్సిందే..











