బాహుబలం హుజురాబాద్ ఏప్రిల్ 29
తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సర్వం సిద్దం చేశారు అధికారులు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలోనూ పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు సిద్దమైంది తెలంగాణ విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 2,676 పరీక్ష కేంద్రాలలో ఎగ్జాన్స్ నిర్వహించింది విద్యాశాఖ. అక్కడక్కడా కొన్ని మాల్ ప్రాక్టీసింగ్ సంఘటనలు చవి చూసినటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా సజావు గా పరీక్షలను నిర్వహించారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన మరుక్షణంలో అధి కారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
