బాహుబలం న్యూస్ హుజూరాబాద్ ఏప్రిల్ 29
పేదల ఆర్థిక రాజ్యాధికార సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు హుజురాబాద్ మండలం దమ్మక్కపే ట గ్రామానికి చెందిన బొరగాల సమ్మయ్య (సారయ్య) తన కార్య కర్తలతో సోమవారం రోజున హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భం గా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా బోరగాల సమ్మయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.పార్టీలో చేరిన వారు కోమురయ్య, రాజకుమార్, సారయ్య, నర్సయ్య, రాజయ్య స్వామి సతీష్ మల్లేష్ చేరాలు సమ్మయ్య దేవయ్య తదిత రులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
