హుజురాబాద్ లో… అక్రమ మట్టి రవాణాను అరికట్టండి అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు తీసుకోండి యూత్ కాంగ్రెస్ నేత టేకుల శ్రవణ్

బాహుబలం ఏప్రిల్ 27 (హుజూరాబాద్)
హుజూరాబాద్ శివారులో సర్వే నెం 496 లో మట్టి (మొరం)ని కొందరు అక్రమ రవాణా చేస్తున్నారని, కానీ అధికారులు ఈ విషయమై చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని యూత్ కాంగ్రెస్ నేత టేకుల శ్రవణ్ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హుజూరాబాద్ శివారులో సిర్సపల్లి శివారు నుండి అక్రమంగా వందల సంఖ్యలో ట్రాక్టర్ల ట్రిప్పుల మట్టి ఎలాంటి అనుమతులు లేకుండానే తరలిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగి పోతున్నారని, యదేచ్చగా వారి ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. తమ ఫిర్యాదులపై అధికారులు తుతూ మంత్రంగా విచారణ జరుపుతున్నారని, అధికారులు పట్టించుకోపోవడం వలన రాత్రింబవళ్ళు బయటి వెంచర్లకు మట్టి తరలిస్తున్నారని ఈ విషయమై తహసీల్దార్, ఆర్. డి.వో కు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

అలాగే హుజూరాబాద్ పట్టణంలో 2418 సర్వే నెంబర్ లో అక్రమంగా ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారని, గతంలో మున్సిపల్ అధికారులు విచారణ జరిపి అక్కడ నిర్మించే ప్రహరి గోడ ను కూల్చి వేశారని, తిరిగి మళ్ళీ గోడను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని, అధికారుల మాటలను సైతం సదరు అక్రమ రవాణా దారులు బేఖాతరు చేస్తున్నారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వెంచర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాపై, అలాగే అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నేత టేకుల శ్రవణ్ కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !