చేనేత వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తీవ్ర పరిణామాలు

బాహు బలం న్యూస్ ఏప్రిల్ 24హుజురాబాద్:
చేనేత ఉత్పత్తిదారుల పరిస్థితి చూస్తే మనసు చలించిపోతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని చేనేత సొసైటీని మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… జమ్మికుంట పట్టణంలోని చేనేత సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు రూ,80 లక్షల స్టాక్ మిగిలి ఉందని గుర్తించినట్లు చెప్పారు. దీంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు రూ,6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.15 కోట్ల వరకు స్టాక్ ఉందని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జిల్లాలోని చేనేత వస్త్రాలను మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులకు అండగా ఉండి వారి ఉత్పత్తి చేసిన స్టాక్ మొత్తం కొనుగోలు చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని అన్నారు. చేనేత కార్మికులకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల బీమా కూడా కేసీఆర్ పాలనలో ఇచ్చారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. చేనేతకు సంబంధించిన మంత్రికి కూడా కనీసానికి వారి బాధల పట్ల అవగాహన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.

రాజకీయాలను పక్కన పెట్టి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. చేనేత కార్మికులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జిల్లాలోని చేనేతలంతా కర్రు కాల్చి వాతపెట్టాలని అన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !